కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా రానా దగ్గుబాటి – మిహికా బజాజ్ ల నిశ్చితార్ధం…!!

0
406
Rana And Miheeka Bajaj Got Engaged

టాలీవుడ్ యువ నటుడు రానా దగ్గుబాటి ఇటీవల తన ప్రేయసి మిహికా తమ లవ్ ని ఒప్పుకుందని, అతి త్వరలోనే ఇద్దరం ఒకటి కాబోతున్నాం అంటూ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కాగా వారి ప్రేమ ని ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వారిద్దరి నిశ్చితార్ధ మహోత్సవం కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. కాగా కాసేపటి క్రితం ఆ వేడుక ఫోటోలను మీడియాకి రిలీజ్ చేసారు.

రానా తెల్లటి షర్ట్, ధోవతి ధరించగా, ధగ ధగ లాడే ఎరుపు రంగు చీరలో మిహిక మెరిసిపోతుంది. చూడచక్కని ఆ జంట నిశ్చితార్ధపు ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా వారి వివాహాన్ని డిసెంబర్ నెలలో నివహించనున్నట్లు ఇటీవల రానా తండ్రి సురేష్ బాబు ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ చెప్పారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here