ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మన భారతదేశంతో పాటు పలు ఇతర దేశాలు ఇప్పటికే కొద్దిరోజులపాటు ప్రజల్ని తమ ఇళ్ళకి పరిమితం చేస్తూ కొద్దివారాల పాటు లాకౌట్ ప్రకటించడం జరిగింది. అయితే దీనివలన దిగువ వర్గాల ప్రజలకు పనుల్లేక, తినడానికి తిండి కూడా లేక నానా అవస్థలు పడుతుండడంతో, అటువంటివారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళంగా కొంత మొత్తాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు.
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇప్పటికే కొందరు విరాళాలు అందించగా, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ నేడు, మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన కరోనా విపత్తు నిధికి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. వాస్తవానికి ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు మొత్తం రూ.10 లక్షలు అందించిన కొరటాల, మరొక్కసారి రూ.5 లక్షలు అందించి తన గొప్ప మనసుని చాటుకున్నారు…..!!