స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ ల ”పుష్ప” ఫస్ట్ లుక్ రిలీజ్……!!

0
957
AA20 First Look Out Titled As Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి జోష్ మీదున్నారు. దాని అనంతరం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఆ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆ సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసారు నిర్మాతలు.

ఆ పోస్టర్ లో ఫుల్ క్రాఫ్, గుబురు గడ్డంతో పూర్తిగా మాస్ లుక్ లో అల్లు అర్జున్ కనపడుతుండడంతో సినిమా మంచి మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతోంది. కాగా నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు తో పాటు  సినిమాకు పుష్ప అనే టైటిల్ ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అమితానందోత్సహాల్లో మునిగిపోయారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాకౌట్ అనంతరం ప్రారంభం కానుంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here