ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు ఈ రోజు అర్ధరాత్రి నుంచి మొదలయ్యే 21 రోజుల లాక్ డౌన్ ను అందరూ విధిగా పాటించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. ఈ లాక్ డౌన్ కు అందరూ సహకరించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వేరే దారి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలను అనుసరించండి. దయచేసి అందరూ ఇంటికే పరిమితం కావాలని కోరుతున్నాను. బయటికి ఎవరు రావద్దు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనా ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి సేవలు, సూచనలు పొందండి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. జైహింద్
– పవన్ కళ్యాణ్, అధ్యక్షులు జనసేన
– మీడియా విభాగం,
జనసేనపార్టీ