`118`తో హిట్ సాధించి ప్రస్తుతం `మహానటి`తో జాతీయ అవార్డ్ అందుకున్న కీర్తిసురేశ్ తో `మిస్ ఇండియా` చిత్రాన్ని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్. ఈ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.4 త్వరలోనే ప్రారంభం కానుంది. `ఉహలు గుసగుసలాడే` సినిమా నుండి రీసెంట్‌గా విడుదలైన `అశ్వథ్థామ` సినిమా వరకు హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు.
పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజా ఈచిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేశ్ కోనేరు నిర్మాత. యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా వేసవి ప్రారంభంలో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. త్వరలోనే ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
[…] శిఖర కోనేరు సమర్పణలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్ కోనేరు ఈ మూవీని […]