`మత్తువదలరా` చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్ రావడం హ్యాపీగా ఉంది – చిత్ర దర్శకుడు రితేష్‌ రానా

0
849

స్వరవాణి ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రం ద్వారా రితేష్‌ రానా దర్శకుడిగా పరిచయం అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత దర్శకుడు రితేష్‌ రానా తో  ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రితేష్‌ రానా తో ఇంటర్వ్యూ.

ఈ చిత్రానికి ఆడియన్స్‌ ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది?
– అందరి దగ్గరనుండి పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. క్రిటిక్స్‌ నుండి కూడా మ్యాగ్జిమమ్‌ పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. నిన్నే మల్లి కార్జున, ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ థియేట్సర్‌కి వెళ్ళాం. ఆడియన్స్‌ రెస్పాన్స్‌ కూడా చాలా బాగుడటంతో సంతోషంగా ఉంది.

మీ నేపథ్యం గురించి?
– మాది హైదరాబాద్‌. పదేళ్లుగా షార్ట్‌ ఫిలిమ్స్‌ చేస్తున్నాను. నాతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు. మేమంతా ఒక టీమ్‌. నేను విఎఫ్‌ఎక్స్‌ కోర్స్‌ చేశాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌ మేమే చేసుకున్నాం. సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్‌ పై అవగాహన ఉంది. ఆ డెమో వీడియోస్‌ అన్నీ తెచ్చి చెర్రీగారికి చూపించాం. ఆయనకి నచ్చాయి. అప్పుడు ఈ స్టోరీ నేరేట్‌ చేశాం. అది కూడా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయింది.

మూడు సంవత్సరాలు ఒకే స్టోరీతో ప్రయాణం చెయ్యడం కష్టమనిపించిందా?
– అలా ఏం అనిరపించలేదు. 2016లో ఈ కథ చెప్పాను. ఎందుకంటే ఒక కొత్త టీమ్‌ సినిమా తీసి విడుదల చేయాలంటే బేనర్‌ వేల్యూ చాలా అవసరం. అది లేకుండా నేను బయటికెళ్ళి సినిమా తీసినా ఇంత రెస్పాన్స్‌ వచ్చుండేది కాదు. ఈ నిర్మాతలు మా మీద నమ్మకం ఉంచారు కాబట్టే ఇంత మంచి సినిమా తీయగలిగాం.

నోట్ల రద్దుకి ముందు కథ తీసుకోవడానికి రీజనేంటి?
– నోట్ల రద్దుకి ముందు క్యాష్‌ ఆన్‌ డెలివరీస్‌ ఎక్కువ ఉన్నాయి. డీ మానిటైజేషన్‌ తరువాత చాలా తగ్గాయి. మా సినిమాలో మెయిన్‌ పాయింట్‌ ఏదయితే ఉందో అది ఇప్పుడున్న సిట్చ్యుయేషన్‌లో అంతగా వర్కౌట్‌ అవ్వదు. అందుకే 2016 స్టోరీ తోనే వెళ్ళాం.

ఒక పెద్ద సినిమాకి అయ్యే డిఐ ఖర్చుతో సినిమా తీశారని విన్నాం?
– అదంతా మా టీమ్‌ వల్లనే కుదిరింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దగ్గర్నుండి అన్ని పనులు మేమే పక్కాగా ప్లాన్‌ చేసుకొన్నాం. మా నిర్మాత చెర్రీగారికి నచ్చింది కూడా అదే విషయం.

కొత్త దర్శకులు లవ్‌ స్టోరీస్‌గానీ, లేదా కమర్షియల్‌ సబ్జెక్ట్స్‌ ఎంచుకుంటారు. వాటికి భిన్నంగా పాటలు, ఫైట్స్‌ లేని స్టోరీని ఎంచుకున్నారు?
– ఫస్ట్‌ మూవీ కాబట్టి ఆడియన్స్‌కి కొత్తగా ఏదయినా చూపిద్దాం అని ట్రై చేశాం. ఈ కథలో లవ్‌, సాంగ్స్‌, ఫైట్స్‌ అవసరం లేదు. ఈ విషయం రవిగారికి, చెర్రిగారికి చెప్పినప్పుడు వాళ్ళు కూడా యాడ్‌ చేయమని చెప్పలేదు. ఏ కథనైనా ముందుకు డ్రైవ్‌ చేయగలిగితేనే సాంగ్స్‌ పెట్టాలనేది నా ఉద్దేశ్యం. ఈ కథలో ఆ స్కోప్‌ లేదు.

ఇది వరకు యుట్యూబ్‌లో బాగా వైరల్‌ అయిన ఒక వీడియో ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నారా?
– అవునండీ. నేను, మా రైటర్‌ తేజ కలిసి ఆ వీడియో చూస్తున్నప్పుడు ఒకవేళ అతను దొరికితే ఎలా ఉంటుంది అనే పాయింట్‌ మీద ఈ కథ రాసుకున్నాం. దాన్ని డెవలప్‌ చేసి హీరో క్యారెక్టరైజేషన్‌ కొన్ని ఎలిమెంట్స్‌ ఫామ్‌ చేశాం.

చెర్రిగారికి మీరు ఎలా పరిచయం అయ్యారు?
– నాకు ముందు తెలీదు. ఒక మ్యూచవల్‌ ఫ్రెండ్‌ ద్వారా నాకు ఆయన అపాయింట్‌మెంట్‌ దొరికింది. అలా నేరేట్‌ చేశాను.

ఈ సినిమాకి ఇంతటి ప్రశంసలు వస్తాయని ఎక్స్‌పెక్ట్‌ చేశారా?
– అలా ఏం లేదు. ముందు ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం. అలాగే మాకు దొరికిన అవకాశాన్ని మమ్మల్ని మేం ప్రూవ్‌ చేసుకోవాలి, చెప్పిన స్టోరీ చెప్పినట్టుగా తీయాలి అనుకున్నాం.

ఇండస్ట్రీ నుండి ఎలాంటి అప్రిషియేషన్‌ వచ్చింది?
– ఇంతకు ముందే నిఖిల్‌గారు ఫోన్‌ చేసి ‘సినిమా చాలా బాగుంది’ అన్నారు. అలా కొంతమంది నుండి అప్రిసియేషన్‌ కాల్స్‌ వస్తున్నాయి.

కీరవాణిగారి అబ్బాయి హీరో అనగానే ఫస్ట్‌ మీ రియాక్షన్‌ ఏంటి?
– శ్రీసింహా కీరవాణిగారి అబ్బాయి అని నాకు ముందు తెలీదు. డైలాగ్‌ వెర్షన్‌ అప్పుడు ఆయన వచ్చి కూర్చున్నారు. చెప్పేసి వెళ్ళిపోయాక ఇతను అయితే ఎలా ఉంటాడు అని అడిగితే.. కరెక్ట్‌గా సెట్‌ అవుతాడు అని చెప్పాను. ఆ తరువాత కీరవాణిగారి అబ్బాయి అని చెప్పారు. కొత్త స్టోరీ, కొత్త జోనర్‌ ఇంకేమైనా ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయమంటారేమో అనుకున్నాం. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఇన్వాల్వ్‌ కాలేదు. తిను కూడా ఎప్పుడు ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన అబ్బాయిలా బిహేవ్‌ చేయలేదు. జస్ట్‌ న్యూ కామర్‌ ఎలా ఉంటాడో అలానే బిహేవ్‌ చేశారు.

రాజమౌళి సినిమా చూసి ఏమైనా సజిషన్స్‌ ఇచ్చారా?
– లేదండి! రాజమౌళిగారు మూడుసార్లు సినిమా చూశారు. ఆయన ట్విట్టర్ ద్వారా మా టీమ్‌ను అభినందించారు. తొలిప్రయత్నంలోనే మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు.

కొత్తవాళ్ళతో చెయ్యాలని ముందే డిసైడ్‌ అయ్యారా?
– ఈ సినిమాలో మూడు లీడ్‌ క్యారెక్టర్స్‌ మాత్రమే కొత్తవారిని తీసుకున్నాం. మిగతా సత్య, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ క్యారెక్టర్స్‌కి వారిని ఊహించుకునే రాసుకున్నాను. మాకు ఇదివరకే కొంత అనుభవం ఉంది కాబట్టి టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ కొత్తవారిని తీసుకున్నాం.

ఇదో కొత్త జోనర్‌ అన్నారు?
– అవునండీ. హూ డన్‌ ఇట్‌ అనే థ్రిల్లర్‌ జోనర్‌. అంటే ఎవరు చేశారు? అని అర్ధం. ఒక క్రైమ్‌ జరిగినప్పుడు ఎవరు చేశారు అని వెతుక్కుంటూ వెళ్ళి సాల్వ్‌ చేసే జోనర్‌.

కాలభైరవ మ్యూజిక్‌ ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అయ్యింది?
– సినిమా చూసిన ఆడియన్స్‌ అంతా హూ హూ అంటుంటేనే అర్ధం అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎంత ప్లస్‌ అయ్యిందనేది. ముందే కొత్త వేలో వెళ్దాం అనుకున్నాం. ఆ హు అనే హుక్‌ వర్డ్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

చిరంజీవిగారి సినిమాలని రిఫరెన్స్‌గా తీసుకున్నారు కదా? దానికేమైనా రీజన్‌ ఉందా?
– బేసిగ్గా టి.వి.తో సినిమా స్టార్ట్‌ అవుతుంది. అలాగే టీవీలో ఇంటర్వెల్‌ పడుతుంది. మళ్ళీ టీవీతోనే సినిమా ఎండ్‌ అవుతుంది. అలా టీవీకి కూడా ఒక క్యారెక్టర్‌లా పెట్టుకున్నాం. నేను చిరంజీవిగారి ఫ్యాన్‌ని. అందుకే ఆయన సీన్స్‌ చూపించాం. లక్కీగా అది బాగా సెట్ అయింది.

మీ తదుపరి సినిమాల గురించి ?
– కథలు రెండు మూడు ఉన్నాయి అండి. ఇంకా ఏమి అనుకోలేదు. వచ్చే అవకాశాలను బట్టి ఎలాంటి కథ చేస్తే బాగుంటుందో అదే చేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here