‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు – చిత్ర దర్శకుడు టి. సంతోష్.

0
672

యంగ్ హీరో నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి. సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన చిత్రం`అర్జున్ సుర‌వ‌రం. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లై థ్రిల్లింగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టి. సంతోష్ ఇంటర్వ్యూ…

అర్జున్ సురవరం రెస్పాన్స్ ఎలా ఉంది?
– మా సినిమాకు ఆదరణ చాల బాగుంది. అన్ని థియేటర్స్ లో ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా తీశారు అని పొగుడుతున్నారు. అలాగే చాలా మంది సెలెబ్రేటిస్ కి ట్విట్టర్ ద్వారా విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మా సినిమాని ఆదరించి మంచి రివ్యూస్ ఇచ్చిన క్రిటిక్స్ కు, ముందునుండి మా సినిమాని జనంలోకి తీసుకెళ్లినందుకు మీడియాకు చాలా థాంక్స్.

మీకు తెలుగు రాదు కదా మేకింగ్ ఏమైనా కష్టంగా అనిపించిందా ?
– నాకు తెలుగు మాట్లాడితే అర్ధం అవుతుంది. నిజంగా తెలుగు మంచి బ్యూటిఫుల్ లాంగ్వేజ్. కొంచెం కొంచెం మాట్లాడతాను. తెలుగు పీపుల్ వెరీ లవబుల్ పీపుల్. సినిమాను వారు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. అయితే నా తరువాత సినిమాకి తెలుగు పూర్తిగా నేర్చుకుంటాను.

ఈ సినిమా నిఖిల్ తోనే చేయడానికి కారణం ?
– మా నిర్మాత భానుగారు ముందుగా నిఖిల్ ను అప్రోచ్ అయ్యారు. అప్పటికీ నిఖిల్ గురించి నేను విన్నాను గాని, తన సినిమాలేవీ చూడలేదు. అప్పుడే తన సినిమాలు చూసి.. తన లుక్ మార్చాలని అనుకున్నాము. ఈ సినిమా కోసం తను అద్భుతమైన ఎఫెక్ట్స్ పెట్టాడు. తను కెమెరా ముందే కాదు, వెనుక కూడా వెరీ యాక్టివ్. నిఖిల్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేనిది. ‘అర్జున్ సురవరం’ క్యారెక్టర్ కి లైఫ్ ఇచ్చారు

అర్జున్ సురవరం స్క్రిప్ట్ రాయడానికి ప్రేరణ ఏమిటి ?
– నాకు వ్యక్తిగతంగా మీడియా అంటే బాగా ఫ్యాషన్. ఒకవేళ నేను డైరెక్టర్ ని కాకపోయి ఉండిఉంటే..ఖచ్చితంగా రిపోర్టర్ అయ్యే వాన్ని. ఆ ఆసక్తితోనే ఈ స్క్రిప్ట్ రాసుకున్నాను. అయితే తెలుగు వెర్షన్ లో కాస్త ఎమోషన్ ను ఎక్కువ చేసి చూపాను. ఎందుకంటే ఇక్కడి ప్రేక్షకులు ఫన్ అండ్ ఎమోషన్ ఉన్న సినిమాలను ఇక్కడ బాగా ఆదరిస్తారు.

ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడినప్పుడు బాధ కలిగిందా ?
– కొన్ని సమస్యలు ప్రతి ఫీల్డ్ లోనూ ఉంటాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ ఉంటాయి. అయితే ఏడు ఎనిమిది నెలలు సినిమా పోస్ట్ ఫోన్ అయినప్పుడు కొంత బాధ కలిగించింది. కానీ ఇప్పుడు విడుదలై సక్సెస్ సాధించడం హ్యాపీ గా ఉంది.

తమిళంలో రెస్పాన్స్ ఎలా ఉంది ?
– అక్కడ కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక అప్ కమింగ్ హీరో సినిమాకు తమిళంలో హౌస్ ఫుల్ అనేది రేర్ గా జరుగుతుంది. అది మా సినిమాకు జరగడంతో చాల సంతోషంగా ఉన్నాము.

నిర్మాతల సహకారం గురించి?
– మా చిత్రానికి ఠాగూర్ మధు గారి సహకారం మరువలేనిది. ఆయన చాలా డీసెంట్ పర్సన్. చాలా కామ్ గా ఉంటారు. వెరీ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. అలాగే రాజ్ కుమార్ గారికి మొదటి సినిమా అయినా చాలా సపోర్ట్ చేశారు. షూటింగ్ సమయంలో ఆయన హెల్ప్ మరువలేనిది. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదినారాయణ గారు ప్రొడక్షన్ టీమ్ కి, డైరెక్షన్ టీమ్ కి ఒక బ్రిడ్జ్ లా పని చేసి మాకు వచ్చిన అన్ని సమస్యలను సాల్వ్ చేశారు.

మీ తదుపరి సినిమా తెలుగులోనే ఉంటుందా?
– తప్పకుండా ఉంటుంది. తెలుగు,తమిళం బైలింగ్యువల్ అయితే ఇంకా ఇంకా హ్యాపీ. ప్రస్తుతం కొన్ని డిస్కర్షన్స్ జరుగుతున్నాయి వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here