నాగచైతన్య ప్రపంచాన్ని పరిచయం చేసిన శేఖర్ కమ్ముల

0
815
NC 19 First Glimpse

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి మొన్న హీరో చైతు లుక్ విడుదలైంది. ఆ పోస్టర్ లో సూపర్ కూల్ లుక్ అద్భుతమైన స్పందన లభించింది. సూపర్ ఎనర్జీ తో ఉన్న యువ సామ్రాట్ ని చూసి అక్కినేని అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు నాగచైతన్య ప్రపంచాన్ని పరిచయం చేసే ఓ వీడియో విడుదల చేసాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల . ఈ వీడియో లో చైతు చాలా సహాజంగా కనిపించాడు. ఆడుతూ పాడుతూ తన పనులు తాను చేసుకుంటున్న చైతు కొత్త గా ఉన్నాడు. ఈ వీడియో రెస్పాన్స్ తో చిత్ర యూనిట్, చైతన్య అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలవుతుంది.2020 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సహా నిర్మాత : విజయ్ భాస్కర్ నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here