జనవరి 15న కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా

0
377

118 సినిమాతో డిఫరెంట్ హిట్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా సంక్రాంతికి కొత్త సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు. శతమానం భవతి సినిమాతో ట్రేడ్ మార్క్ హిట్ కొట్టిన దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా! అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామాను జనవరి 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ అప్పుడపుడు రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ తో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు.

సంక్రాంతికి ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంతో ఆ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఇటీవల హీరోయిన్ నటశా దోషి – కళ్యాణ్ రామ్ మధ్య సాంగ్ ని చిత్రీకరించిన చిత్ర యూనిట్ రాజమండ్రి – గొదావరి పరిసర ప్రాంతాల్లో కళ్యాణ్ రామ్ విలన్ల మధ్య ఒక షెడ్యూల్ ని పూర్తి చేసింది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here