హాట్ అవికా.. చిన్నారి పెళ్లి కూతురు ఎంతగా మారిపోయిందో?

0
612

దేశ వ్యాప్తంగా బాలికా వధూ అనే సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న క్యూట్ బ్యూటీ అవికా గోర్. ఇక తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన అవికా ఉయ్యాల జంపాల – సినిమా చూపిస్త మావ సినిమాలతో హీరోయిన్ గా క్లిక్కయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో అవికా ఎవరు ఉహించని విధంగా దర్శనమిస్తోంది.

ఫ్యాషన్ ప్రపంచంలో నేటితరం మోడల్స్ కి ధీటుగా గ్లామర్ డ్రెస్సుల్లో కనిపిస్తోంది. ఇక గ్లామర్ హీరోయిన్ గా కూడా రెడీ అంటూ అప్పుడపుడు హాట్ ఫొటోస్ తో హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక్కసారి ఆమె ఇన్స్టాగ్రామ్ పై ఓ లుక్కిస్తే అవికా ఎంతగా మారిపోయిందో అర్ధమవుతుంది. ఇటీవల ముంబైలో జరిగిన గోల్డ్ అవార్డ్స్ లో ఈ విధంగా గ్లామరస్ గర్ల్ గా అందరిని ఆకర్షించింది.

ఇకపోతే రైజింగ్ స్టార్ గా అవికా గోర్ స్పెషల్ అవార్డ్ కూడా అందుకుంది. ఆమెకు సంబందించి రీసెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ అవికా తెలుగులో రాజుగారి గది 3 సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబందించిన పోస్టర్ టీజర్ ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్ ని క్రియేట్ చేసింది. మరి నవంబర్ లో విడుదల కాబోయే ఆ సినిమా ద్వారా అవికా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here