`రాజుగారిగ‌ది 3 ‘ చిత్రం ఆడియన్స్ ని ఫుల్ఎంటర్టైన్ చేస్తుంది – హీరో అశ్విన్‌బాబు

0
966

`రాజుగారిగ‌ది` హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం. ఈ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం `రాజుగారిగ‌ది 3`. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సినిమా నిర్మిత‌మైంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ రావడంతో మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అక్టోబర్ 18 గ్రాండ్ గా రిలీజవుతున్న సందర్భంగా హీరో అశ్విన్ బాబు ఇంటర్వ్యూ..

రాజుగారిగది-3 ఎలా స్టార్ట్‌ అయ్యింది?
– ‘రాజుగారిగది’ చేస్తున్నపుడు 2,3 పార్ట్స్‌ చేస్తాం అని మేము అనుకోలేదు. అయితే
ఫస్ట్‌ పార్ట్‌ను ప్రేక్షకులు ఆదరించారు కనుకే .. పార్ట్‌ 2కు నాగార్జున, సమంత గారి సపోర్ట్‌ వచ్చింది. పార్ట్‌ 2లో ఎంటర్‌టైన్మెంట్‌ తగ్గింది అన్నారు.. దాన్ని ఫుల్‌ఫిల్‌ చేయడానికే రాజుగారిగది-3 చేశాం. ఇందులో ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఖాయం.

ఒకే సబ్జెక్ట్‌ మీద సినిమాలు చేయడం ఎలా అనిపిస్తోంది?
– ఒకే సబ్జెక్ట్‌ కాదు.. ప్రతీ సినిమాలోనూ కథలు ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టే సినిమాలు ఆదరిస్తున్నారు. అందుకే ఇప్పుడు పార్ట్‌ 3.. ఇది సక్సెస్‌ అయితే 4 కూడా రావొచ్చు…

మిగతా ఆర్టిస్టుల గురించి?
– ఇందులో సీనియర్‌ యాక్టర్స్‌ అలీ, బ్రహ్మాజీ, ఊర్వశమ్మ లాంటి వాళ్లు ఉన్నారు. రెండో భాగం అంటే కథకు తగ్గట్లుగా నాగార్జున, సమంత గారు వచ్చారు. ఇప్పుడు కథకు తగ్గట్లుగానే నార్మల్‌ కాస్టింగ్‌తో వచ్చాం.

ఆడియన్స్‌కు నచ్చే అంశాలు?
– ఆడియన్స్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో హార్రర్‌ సీన్స్‌ వచ్చినపుడు అక్కడ భయాన్ని వాళ్లు నవ్వుగా మలుచుకుని ఎంజాయ్‌ చేస్తారు.. దాంతో పాటు నాకు కూడా మాస్‌ క్యారెక్టర్‌ పడింది. ఈ సినిమాలో ఆడియన్స్‌కు నా తరఫు నుంచి మాటిచ్చేది ఏంటంటే.. పార్ట్‌ 1,2లో ఉన్న ఎంటర్‌టైన్మెంట్‌ కంటే ఇందులో ఎక్కువగా ఉంటుంది. అలీ, బ్రహ్మాజీ, ఊర్వశమ్మ, అజయ్‌ ఘోష్‌ లాంటి వాళ్లు కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తారు.

ఛోటా కే నాయుడు ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్‌ అవుతాడు?
-ఆయన చాలా పెద్ద టెక్నీషియన్‌.. జూన్‌లో సినిమా మొదలు పెట్టి అక్టోబర్‌ 18న విడుదలకు వస్తున్నామంటే దానికి కారణం ఆయనే. ఈ సినిమాకు మెయిన్‌ పిల్లర్‌ ఛోటా కే నాయుడు గారే. ఈ సినిమా ఆయనకు ఓ ఛాలెంజ్‌.. ఇప్పటి వరకు ఆయన ఈ జోనర్‌ చేయలేదు.. అంజి లాంటి సోషియో ఫాంటసి చేశారు.. కానీ హార్రర్‌ కామెడీ చేయలేదు.. ఆయన వర్క్‌ గురించి సినిమా విడుదలైన తర్వాత ప్రత్యేకంగా మాట్లాడతారు.

నటుడిగా ఈ సినిమా మీకు ఎంతవరకు ప్లస్‌ అవుతుంది?
– యాక్టర్‌గా ఇప్పటి వరకు నన్ను గుర్తు పెట్టుకునే పాత్రలు అయితే చేయలేదు. ఫస్ట్‌ పార్ట్‌లో అస్సలు నేను మాట్లాడను.. రెండో పార్ట్‌లో నేను భయపడుతూ మెంటలిస్ట్‌ను కలుస్తాను. అప్పుడు నాగార్జున గారు వస్తారు. ఇక ఇప్పుడు పార్ట్‌ 3లో ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను.. నా క్యారెక్టర్‌ పక్కా మాస్‌ ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేలా ఉంటుంది. పాటలు, డాన్సులు, యాక్షన్‌ సీక్వెన్సులు అన్నీ చేశాను. మాస్‌ హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ కారెక్టర్‌లో ఉంటాయి. అందుకే నేను కూడా అక్టోబర్‌ 18 కోసం ఈగర్‌గా వెయిటింగ్‌.

తొలి రెండు పార్ట్స్‌లో సోషల్‌ మెసేజ్‌ ఇచ్చారు.. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నారా?
– లేదండీ.. తొలి భాగంలో థ్రిల్‌ కలిగించే మెడికల్‌ మాఫియా.. రెండో భాగంలో లేడీస్‌ ఇగో బయట వాళ్ల గురించి సొసైటీ ఎలా ఆలోచిస్తుంది అనేది చూపించాం. ఇప్పుడు అలా కాదు.. హాయిగా థియేటర్స్‌కు వచ్చి 2 గంటలు నవ్వుకుని వెళ్లండి అనేది ఈ సినిమాతో మేం ఇస్తున్న మెసేజ్‌.

తమన్నా స్థానంలో అవికా గోర్‌ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?
– ముందు ఈ సినిమాను తమన్నా గారితోనే మొదలు పెట్టాం. ఓపెనింగ్‌ కూడా అయింది. అయితే ఆమె డేట్స్‌ కారణంగా తప్పుకున్నారు. అప్పటికే రెండు షెడ్యూల్స్‌ లేట్‌ అయ్యాయి కూడా. అక్టోబర్‌ విడుదల పెట్టుకోవడంతో ఇంకా తమన్నా గారి కోసం వేచి చూస్తే బాగోదని వదిలేసుకున్నాం. ఆమె లాంటి స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటి కోసం చూశాం.. కానీ వాళ్ల డేట్స్‌ కూడా కుదర్లేదు. అలాంటి సమయంలో అవికా గోర్‌ వచ్చింది. ఆమె సినిమాకు చాలా పెద్ద ప్లస్‌ అయింది. అవికా గోర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. కచ్చితంగా ఆమె కారెక్టర్‌ అలరిస్తుంది.

మీ కెరీర్‌ గురించి చెప్పండి?
– నా కెరీర్‌ 2012లో స్టార్ట్‌ అయింది.. ‘జీనియస్‌’ సినిమాకు మెయిన్‌ లీడ్‌ చేసాను.. ఆ సినిమా అప్పుడు హీరోలను చూపించకూడదు అనే సరికి షూటింగ్‌ అయ్యేంతవరకు మేం బయటికి రాలేదు. ఆ తర్వాత సినిమా కష్టాలు పడ్డాను. అల్లు అరవింద్‌, బి గోపాల్‌ లాంటి వాళ్లు నా ఫస్ట్‌ సినిమా అప్పుడు వచ్చారు. అక్కడ్నుంచి నా జర్నీ మొదలైంది. ఏ సినిమా ఎలా చేయాలి అనేది ప్లాన్‌ చేసుకున్నాను. ‘రాజుగారిగది’ బ్లాక్‌ బస్టర్‌ అయింది.. కానీ అప్పుడు నాకు పేరు రాలేదు. అది టెక్నీషియన్స్‌ హిట్‌. ఆ తర్వాత ‘జతకలిసే’ సినిమాలో లవర్‌ బాయ్‌ కారెక్టర్‌ చేసాను. తర్వాత నాన్న ‘నేను నా బాయ్‌ ఫ్రెండ్స్‌’.. ఇప్పుడు ‘రాజుగారిగది-3 ‘. మాస్‌ కమర్షియల్‌ సినిమా ఇది. డాన్స్‌, ఫైట్స్‌, యాక్షన్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉంటాయి.

నిర్మాణం లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందికదా! ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
– ఓక్ (OAK)పొడక్షన్స్‌లో నేను కూడా ఓ మెంబర్‌. నాకు నిర్మాత కష్టాలు తెలుసు. నా దగ్గరికి వచ్చిన కథలు చూసి నిర్మాతలకు ఓ రూపాయి లాభం వచ్చేలా ఉంటాను. సపోజ్‌ నాకు 5 కోట్లు మార్కెట్‌ ఉంటే 4 కోట్లలో సినిమా చేయాలి. నాకు మార్కెట్ వచ్చిన తర్వాత కూడా కచ్చితంగా నిర్మాతకు మిగిలేలా జాగ్రత్త పడతాను. .

నెక్ట్స్‌ సినిమాలు ఏంటి?
– మూడు నాలుగు కథలు ఉన్నాయి. అయితే ‘గోదా’ అనే మళయాల సబ్జెక్ట్‌ విన్నాను. నాకు బాగానచ్చింది, మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here