ఎంగేజింగ్ గా సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్ గా చాణక్య అందరినీ ఆకట్టుకుంటుంది – మ్యాచోస్టార్ గోపీచంద్

0
1580

విభిన్న పాత్రలను, సినిమాలను ఎంచుకోవడంలోమ్యాచోస్టార్‌ గోపిచంద్‌ది ప్రత్యేకమైన శైలి. ఒకవైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త కథలతో ప్రేక్షకుల్ని మెప్పించాలన్న తపన పడే హీరో ఆయన. లేటెస్ట్‌గా ఒక స్పై థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌’చాణక్య’తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు. తిరు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అగ్ర నిర్మాత అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించగా బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ ఇంటర్వ్యూ.

చాణక్య’ హైఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్‌ అవుతుంది కదా! ఎలా అనిపిస్తోంది?
– తప్పకుండా మీ అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌ అవుతుంది. నో డౌట్‌. సినిమా చాలా బాగా వచ్చింది. టీమ్‌ అంతా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుంది?
– ఫ్యామిలీస్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్ సినిమాలో ఉంది. మంచి యాక్షన్ ఉంది అలాగే సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది. ఆ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.

మీరంత కాన్ఫిడెన్స్‌గా ఉండటానికి రీజన్‌?
– సినిమాలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్షన్‌ ఉంది. అలాగే ఎమోషన్‌ ఉంది. సినిమాకి వచ్చే ఆడియన్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌కి కూడా కనెక్ట్‌ అవ్వాలి. అప్పుడే ఆ సినిమా సక్సెస్‌ అవుతుంది. అలా ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో ఆడియన్‌ సీట్‌ ఎడ్జ్‌ కూర్చుంటారు. అందుకే అంత కాన్ఫిడెంట్‌.

ఈ జోనర్‌లో ఫస్ట్‌టైమ్‌ సినిమా చేశారు కదా?
– అవునండీ. నేను ఇప్పటివరకూ స్పై థ్రిల్లర్‌, రా ఏజెంట్‌ జోనర్‌లో సినిమా చేయలేదు. అందుకే దర్శకుడు తిరు కథ చెప్పగానే వెంటనే కనెక్ట్‌ అయ్యాను. తను చాలా ఇంట్రెస్టింగ్‌గా నేరేట్‌ చేశారు. ఫస్ట్‌ నుండి చివరి వరకు ఆ ఇంట్రెస్ట్‌ అలాగే సస్టేన్‌ అయ్యింది. ఎండ్‌ కార్డ్‌ పడే వరకూ ఆడియన్స్‌కి కూడా డెఫినెట్‌గా ఆ టెన్షన్‌ రన్‌ అవుతూనే ఉంటుంది.

మీకు ఏ జోనర్‌ సినిమాలంటే ఇష్టం?
– నాకు యాక్షన్‌ మూవీస్‌ అంటే ఇష్టం. దాంతో పాటు ఈ యాక్షన్‌ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు లవ్‌ట్రాక్‌ కలిపారు. అది ఆడియన్స్‌కి ఫ్రెష్‌ ఫీల్‌ కలిగించేలా ఉంటుంది.

గోపీచంద్ అంటేనే మాస్. మరి ఈ సినిమాలో యాక్షన్ ఎంతవరకు ఉంటుంది ?
– ఇది యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్. మీరు ఆశించిన్నట్లుగానే సినిమాలో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే గుడ్ ఫన్ కూడా ఉంటుంది. ఫిల్మ్ లో లాస్ట్ సీన్ వరకూ వాట్ నెస్ట్ అనే ఒక ఇంట్రస్ట్ ఉంటుంది

ట్రైలర్‌లో మీ లుక్‌ కొత్తగా కన్పిస్తోంది?
– నేను గతంలో కూడా బియర్డ్‌ లుక్‌లో కన్పించాను. అయితే ఈ సినిమాలో లుక్‌ స్టైలిష్‌గా ఉంటుంది. లుక్‌ పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యింది. ఆ లుక్‌కి మంచి అప్లాజ్‌ వస్తోంది.

మీ గత సినిమాల కన్నా ఇందులో మోస్ట్‌ గ్లామరస్‌గా కన్పిస్తున్నారు?
– నన్ను మా సినిమాటోగ్రాఫర్‌ వెట్రి అంత గ్లామర్‌గా చూపించారు. సినిమాకి ఆయన ఫొటోగ్రఫీ మంచి ఎస్సెట్‌ అవుతుంది.

ఇండస్ట్రీ ప్రముఖుల కోసం స్పెషల్‌ షో వేశారని తెలుస్తోంది?
– సినిమా రిలీజ్‌కి ముందు ఫైనల్‌గా వారి జడ్జిమెంట్‌ తీసుకుందామని మాకు బాగా క్లోజ్‌ సర్కిల్‌, వెల్‌ విషర్స్‌కి షో వేశాం. యునానిమస్‌గా ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అన్నారు. ఆడియన్స్‌ నుండి కూడా అలాంటి రెస్పాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం.

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఫస్ట్‌టైమ్‌ చేస్తున్నారు కదా?
– అనీల్‌ సుంకరగారు ఒక ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటారు. చివరి మూమెంట్‌ వరకు కూడా సినిమాకు ఇంకా బెటర్‌గా ఏమైనా చెయ్యగలమా అని తపనపడే వ్యక్తి. అలాంటి ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. అనీల్‌గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఇందులో మీ క్యారెక్టర్‌ గురించి?
– సినిమాలో నేను అర్జున్‌ అనే రా ఏజెంట్‌గా కన్పిస్తాను.

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
– చాణక్య అనేది మా మిషన్‌ పేరు. చాణక్య అంటే ఇంటెలిజెన్స్‌. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఇంటెలిజెన్స్‌ని ఎలా ప్లే చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే టైటిల్‌ చెప్పగానే ఈ సబ్జెక్ట్‌కి యాప్ట్‌ అనిపించింది. ఆ మిషన్‌ ఏంటనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఇంటెలిజెన్స్‌ ఉన్నప్పటికీ సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా సినిమా ఉంటుంది. ఎలా అంటే ఈ సినిమాలో కొంత పార్ట్‌ పాకిస్థాన్‌లో ఉంటుంది. యాక్చువల్లీ తీయాలంటే పాకిస్థాన్‌లో తెలుగు మాట్లాడరు. కానీ ప్రేక్షకుల సౌకర్యం కోసం తెలుగులో మాట్లాడించడం జరిగింది.

ఈ సినిమాలో మీరు బాగా ఎంజాయ్‌ చేసిన సందర్భం?
– సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రాక్‌ ఒకటి ఉంటుంది. అది బాగా ఎంజాయ్‌ చేస్తూ చేశాను. సునీల్‌, రఘుబాబు, ఆలీ, హీరోయిన్‌ కాంబినేషన్‌లో ఆ ట్రాక్‌ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్‌. నాతో పాటు ప్రతి ఒక్కరూ ఎంతో ఎంజాయ్‌ చేస్తూ చేశారు.

ఈ సినిమాలో యాక్షన్‌ పార్ట్‌ చేసేటప్పుడు మీకు గాయం అయింది కదా?
– జైసల్మేర్‌లో షూటింగ్‌ చేసేటప్పుడు ఇంకో నాలుగు షాట్స్‌ అయితే షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుందనగా లాస్ట్‌ షాట్‌లో బైక్‌ స్కిడ్‌ అయ్యి నాకు గాయం అయ్యింది. ఇంకొంచెం ఉంటే షూటింగ్‌ అయిపోయేది కదా అని ఆ టైమ్‌లో బాధ వేసింది.

తమిళ్‌ డైరెక్టర్‌ కదా? ఆ ఫ్లేవర్‌ ఎంతవరకు ఉంటుంది?
– నేను నలుగురు తమిళ్‌ డైరెక్టర్స్‌తో వర్క్‌ చేశాను. నాకెప్పుడూ అలాంటి డిఫరెన్స్‌ ఏం కనిపించలేదు. సినిమా స్టోరిని బట్టే ఆ ఫ్లేవర్‌ ఉంటుంది. తిరు తెలుగువాడే. అక్కడ సెటిల్‌ అయ్యారు. కమర్షియల్‌ వేలో సినిమాని ఎలా హ్యాండిల్‌ చెయ్యాలనేది ఖచ్చితంగా తెలిసిన డైరెక్టర్‌.

సైరాకి చాణక్యను పోటీగా ఎందుకు విడుదల చేస్తున్నారు ?
– నిజానికి చాణక్య మూవీని మేము ‘మే’ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాము, కానీ, నేను గాయపడిన తరువాత షూటింగ్ ఆలస్యం అయింది. ఇక ఆ తరువాత, అక్టోబర్ 3న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాము, అప్పటికీ సైరా విడుదల తేదీ ప్రకటించలేదు. ఇక సైరా అక్టోబర్ 2 విడుదల అని ప్రకటించాక, మేము అక్టోబర్ 5న చాణక్య రిలీజ్ ప్లాన్ చేశాము.

దసరా హాలిడేస్ కాబట్టి రెండు సినిమాలను ఆదరిస్తారు ?
– మేము కూడా అదే నమ్ముతున్నాము. దసరా హాలిడేస్ కాబట్టి చాణక్యను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. పైగా చాణక్య మరియు సైరా రెండు సినిమాలు వేరు వేరు నేపథ్యాలకి సంబంధించిన సినిమాలు.

ప్యాన్‌ ఇండియా మూవీ చేసే అవకాశం ఉందా?
– తప్పకుండా ఉంది. ఎందుకంటే గేట్స్‌ ఓపెన్‌ అయ్యాయి కాబట్టి మనం వెళ్ళడానికి ఛాన్స్‌ ఉంది. కథ బాగుంటే ఆడియన్స్‌ డెఫినెట్‌గా రిసీవ్‌ చేసుకుంటారు.

డైలాగ్స్‌ గురించి?
– టీజర్‌కి, ట్రైలర్‌లో డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాలో అద్భుతమైన డైలాగ్స్‌ ఉన్నాయి.

సెట్స్‌లో మీరు కొంచెం రిజర్వ్‌డ్‌గా ఉంటారంట కదా?
– బేసిక్‌గా నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. తొందరగా నేను మాట్లాడలేను కానీ ఒకసారి మాట్లాడిన తర్వాత చాలా బాగా మాట్లాడతాను.

ఇందులో సంగీతానికి ఎంత ఇంపార్టెన్స్‌ ఉంటుంది?
– స్పై థ్రిల్లర్‌ జోనర్‌ కాబట్టి సంగీతానికి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చేసిన తర్వాత ఆ డబుల్‌ పాజిటివిటీ చూసి తిరుతో ఒక్కటే అన్నాను. నువ్వు చెప్పింది యాజిటీజ్‌గా ప్రజెంట్‌ చేస్తావ్‌. కానీ ఈ సినిమా బ్యాక్‌బోన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కాబట్టి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు అన్నప్పుడు.. తను శ్రీచరణ్‌ పాకాల గురించి చెప్పారు. శ్రీచరణ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌గా చేశారు.

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?
– బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారితో బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. అది అడ్వంచరస్‌ స్టోరి. నా సినిమాలకు నెక్స్‌ట్‌ మోడ్‌లో ఉంటుంది. అలాగే సంపత్‌ నంది దర్శకత్వంలో కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నాను. రెండు స్టోరీలు దేనికదే కాంట్రాస్ట్‌గా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here