సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న మరో చిత్రం పొన్నియన్ సెల్వన్. గతంలో ఎప్పుడు లేని విధంగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం ఈ హిస్టారికల్ కథను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. మద్రాస్ టాకీస్ – లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాయి. ఇక డిసెంబర్ లో స్టార్ట్ కానున్న ఈ సినిమా మ్యూజిక్ కోసం ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ కి టార్గెట్ ఇచ్చారట.
సినిమాలో డిఫరెంట్ గా 12 పాటలకు రెహమాన్ కంపోజ్ చేయనున్నట్లు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నేషనల్ అవార్డ్ పోయేట్ వైరముత్తు తెలియజేశారు. చోళ వంశ రాజులకు సంబందించిన పాటలను వైరముత్తు రాయనున్నారు. సినిమాలో సందర్భానుసారం వచ్చే విధంగా సాంగ్స్ ని డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు.విక్రమ్, కార్తీ, జయం రవి నటిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషల ప్రముఖ తారలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్టు వినిపిస్తోంది.