వచ్చే ఏడాది బాలీవుడ్ లో మరో చంద్రముఖి

0
456

సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమా అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.  ఆ సినిమా మలయాళం కథ మనిచిత్రతజు కి రీమేక్ గా వచ్చింది. ఇక అదే కథ 2007లో అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో భూల్ భులియా పేరుతో రిరీమేక్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టిన ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది.

బాలీవుడ్ లో ఈ మధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ భూల్ భూలియా 2లో నటించనున్నాడు. సినిమాకు సంబందించిన ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినిమాను వరల్డ్ వైడ్ గా 2020 జులై 31న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. బాలీవుడ్ లో వెల్కమ్, రెడీ , సింగ్ ఈజ్ కింగ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న అనీస్ బాజ్మీ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – మురాద్జ్ ఖేతని సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here