సాయి కొర్రపాటి గారితో నా స్నేహబంధం ఎంతో మధురమైనది : దర్శక ధీరులు ఎస్ఎస్ రాజమౌళి

0
583

టాలీవుడ్ సినిమా ఖ్యాతిని బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన దర్శక ధీరులు రాజమౌళి, ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక నేడు ఫ్రెండ్ షిప్ డే ని పురస్కరించుకుని రాజమౌళి, తనకు ఎంతో ఇష్టమైన స్నేహితులు, వారాహి చలన చిత్ర సంస్థ అధినేత శ్రీ సాయి కొర్రపాటి గారితో తన స్నేహానుబంధాన్ని తెల్పుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది.

‘విధిరాత మనకు అనుకూలిస్తే, సాయి గారు వంటి గొప్ప వ్యక్తిని మనం స్నేహితులుగా పొందగలుగుతాం. చిన్న పిల్లాడి వంటి మనసున్న ఆయన ఎప్పుడూ తోడుగా నిలిచి అందించే సపోర్ట్ ఎప్పటికీ మరువలేను, ఆయనే నా భీం, అందుకే ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా జీవించాలని కోరుకుంటాను’ అంటూ రాజమౌళి తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. ఇక ఆయన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ, ‘నేను ఇప్పుడు, ఇక్కడ ఇంత సంతోషంగా ఉన్నాను అంటే, దానికి మీరు మరియు మీరు అందించిన సపోర్టే కారణం’ అంటూ సాయి కొర్రపాటి గారు పోస్ట్ చేయడం జరిగింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here