ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ గా మా ‘రాక్షసుడు’ ఘన విజయం సాధిస్తుంది – నిర్మాత, ప్రముఖ విద్యావేత్త కోనేరు సత్యనారాయణ

0
635

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాక్షసుడు“. తమిళంతో విజయవంతమైన “రాక్షసన్” చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఏ హావిష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్ బ్యానేర్ పై ప్రముఖ విద్యా వేత్త కోనేరుసత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానేర్ పై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని ఆగష్టు 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ ఇంటర్వ్యూ..

ప్రఖ్యాత కెఎల్ యూనివర్సిటీకి విజయవాడ ఛైర్మన్ అయుండి నిర్మాణం వైపు రావడానికి కారణం?
– దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నాను. మా కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ నేషనల్ వైజ్ గా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాస్ట్ ఇయర్ నుండి హైదరాబాద్ లో కూడా మా బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. జీనియస్ అని మా అబ్బాయి హవీష్ హీరోగా చేసిన చిత్రానికి గతం లో పని చేసి నప్పటికీ పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. అయితే సినీ నిర్మాణం వైపు రావడానికి కారణం మాత్రం మా అబ్బాయి హవీషే. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘రాక్షసుడు’ సినిమాకు ఏ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ స్థాపించి పూర్తి స్థాయి నిర్మాణ భాద్యతలు చేపట్టాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాతోనే పూర్తిస్థాయి నిర్మాతగా మారాను.

ఈ స్క్రిప్ట్ నే ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా ?
– నేను ఈ సినిమాను తమిళ్ లో విడుదలైన వారం రోజుల్లోనే చూసాను. తమిళంలో విజయవంతమైన “రాక్షసన్” సినిమాని ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నాం. ముందు మా హవీష్ కోసం “రాక్షసన్” చూసాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అయితే అప్పటికే హవీష్ ఇలాంటి జోనర్ లోనే ఆల్ రెడీ ఓ సినిమా చేస్తున్నాడు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా తీసుకున్నాము.

తెలుగులో మార్పులు ఏమైనా చేయించారా ?
– లేదండి. డైరెక్టర్ రమేష్ వర్మకు నేను ఫస్ట్ నుండి ఒక్కటే చెప్పాను. ‘రాక్షసన్’ స్క్రిప్ట్ లో ఒక్క అక్షరం మార్చినా ఆడియన్స్ కి ఆ ఫీల్ తగ్గుతుంది. అందుకే అలానే తీయమని చెప్పాను. నిజానికి ఉన్నది ఉన్నట్లు తియ్యడం కూడా కష్టమే. అయితే ఆ స్క్రిప్ట్ కి తగ్గట్లుగానే అచ్చం అలాగే ‘రాక్షసుడు’ సినిమా వచ్చింది. రమేష్ వర్మ కూడా కథలో ఇన్వాల్వ్ అయ్యి అత్యద్భుతంగా తెరకెక్కించారు. అతనికి టెక్నీకల్ గా కూడా మంచి సపోర్ట్ లభించింది.

రాక్షసుడు టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి ?
– సినిమాకి తగ్గట్లే పెట్టాం. అయితే మన సినిమాల టైటిల్స్ అన్నీ హీరోని లేదా హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకుని పెడతారు. కానీ ఈ సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టడానికి కారణం ఈ సినిమా కాన్సెప్టే. సినిమా చూశాక ఆడియన్స్ కూడా ఇదే యాప్ట్ టైటిల్ అని ఫీల్ అవుతారు.

ఈ సినిమాలో సందేశం ఉంటుందా?
– నేను ‘జీనియస్’ చిత్రాన్ని నిర్మించడానికి కూడా అందులో ఉన్న మంచి సందేశమే కారణం. నా ప్రతి సినిమాలోనూ ఒక మంచి సందేశం ఉండేలా చూస్తాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఆడపిల్లలు ఉన్నప్పుడు, వారు స్కూల్ కి వెళ్తున్నప్పుడు వారి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూపించడం జరిగింది.మేము అనుకున్న విధంగా ఆ సందేశం ప్రేక్షుకులకు కన్వే అవుతుంది.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెర్ఫామెన్స్?
– బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా లు నేను తక్కువగా చూశాను. అయితే ఈ కథకు తను బాగుంటాడని అనుకోని తనని హీరోగా తీసుకోవడం జరిగింది. మేము అనుకున్నట్లే నిజంగా శ్రీనివాస్ చాల మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఎమోషన్ని అండ్ యాక్షన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈసినిమాకు సాయి నటన కూడా ప్లస్ అవుతుంది.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎవరి ఛాయిస్?
– ఈ సినిమాలో హీరోయిన్ టీచర్ రోల్ లో కనిపిస్తుంది దాని కోసం మొదట చాలా మందిని అనుకున్నాం. అందులో రాశి ఖన్నాకూడా ఒకరు. అయితే ఈ క్యారెక్టర్ కి అనుపమ అయితే జస్టిస్ చేయగలదని అనుపమ పరమేశ్వరన్ తీసుకున్నాం. తను చాలా బాగా నటించింది. కథలో వచ్చే కీలక మార్పు కి ఆమె క్యారెక్టర్ కారణం అవుతుంది.

సినీ నిర్మాణం పై మీ అభిప్రాయం ఏమిటి ?
– ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా పక్కాగా చెయ్యాలి. అసలు సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే దాని పైఎక్కువ వర్క్ చేయాలి. అలాగే కథ కథనం మాటలే సినిమాకి మెయిన్. కానీ మనవాళ్ళు మాత్రం ఏదో హడావుడిగా కథ మాటలు రాయించుకోని ప్రొడక్షన్ కి వెళ్ళిపోతారు. అది పూర్తిగా రాంగ్. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కి సంబధించిన వర్క్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా అనుకున్న సమయంలో సినిమా రిలీజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. అయితే నేను సినీ నిర్మాణం రావడానికి కారణం ఒక్కటి అయితే.. మరో కారణం ఎంటర్టైన్మెంట్ యూనివర్సిటీ పెట్టాలనేది నా గోల్.

సినిమా బిజినెస్ ఎలా ఉంది ?
– బిజినెస్ అయిపోయిందండి. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకే మా సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి. అలాగే డిజిటల్స్ రైట్స్ జెమినివారు తీసుకోవడం జరిగింది. హిందీ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ఇక అభిషేక్ పిక్చర్స్ వారు మా రాక్షసుడు సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. అందుకు వారికి కూడా ధన్యవాదాలు.

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?
– రెండు మూడు కథలు రెడీ గా ఉన్నాయి. అందులో మా అబ్బాయి హవీష్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాము. అలాగే యంగ్ టాలెంట్ తో వచ్చే నూతన దర్శకులు, నటీనటులతో పనిచేస్తాం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here