స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ రాకతో ‘లవర్స్‌ డే’ సినిమా ప్రమోషన్స్‌ నెక్స్ట్‌లెవెల్‌కి వెళ్లాయి – నిర్మాత ఎ.గురురాజ్‌.

0
152

సోషల్‌మీడియాలో చిన్న టీజర్‌తోనే నేషనల్‌ వైడ్‌ పాపులారిటి క్రియేట్‌ చేసుకున్న సెన్సేషనల్‌ హీరోయిన్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్‌ డే’ పేరుతో సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సమర్పణలో సుఖీభవ సినిమాస్‌ సంస్థ విడుదల చేస్తోంది. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు షాన్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. వాలెంటైన్స్‌ డే కానుకగా ఈ సినిమాఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేస్తున్న నిర్మాత ఎ.గురురాజ్‌ ఇంటర్వ్యూ.

రియల్‌ఎస్టేట్‌రంగంలో వ్యాపారవేత్తగా మంచిపేరు సంపాదించుకున్న మీరు మళ్ళీ నిర్మాతగా మారడానికి కారణం?
– మాది మధ్యతరగతి కుటుంబం. నేను నటుడ్ని కావాలనే కోరికతో సినిమారంగానికి రావడం జరిగింది. కానీ అప్పట్లో అవకాశం, అద ష్టం లేక నటుడ్ని కాలేకపోయాను. ఆ తరువాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చి సుఖీభవ ప్రాపర్టీస్‌ సంస్థను స్థాపించి అంచలంచలుగా ఎదిగి రియల్‌ఎస్టేట్‌రంగంలో మంచిపేరును, మంచిస్థాయిని సంపాదించుకున్నాను, నేను ఎదగడానికి ఎంతగానో తోడ్పడిన నా స్నేహితులకు, మీడియాకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు సినిమా ఇండస్ట్రీపై ఉన్న ఫ్యాషన్‌తో చాలా సినిమాలకు గెలుపోటములతో సంబంధం లేకుండా నిర్మాతగా వ్యవహరించాను, వ్యవహరిస్తూనే ఉంటాను.

‘ఒరు ఆధార్‌ లవ్‌’ సినిమాను తెలుగులో విడుదలచేయానికి గల కారణం?
– ఈ మధ్యకాలంలో ఇండియన్‌స్క్రీన్‌ మీద చెప్పుకోదగ్గ సినిమాలు ‘కొలవరి డీ’ సాంగ్‌తో ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసిన ధనుష్‌హీరోగా నటించిన ‘త్రీ’ సినిమా. తరువాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ‘బాహుబలి’. ఆ తరువాత ఇండియాలోనే పుట్టి ఒక్క టీజర్‌తోనే నేషనల్‌వైడ్‌ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాప్రకాష్‌ వారియర్‌ నటించిన ‘ఒరు ఆధార్‌ లవ్‌’ సినిమా. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం మాకు లభించినందుకు మేము చాలా హ్యాపీ. నిర్మాతగా నాకున్న అనుభవంతో పాటు ఈ ఇండస్ట్రీలోనే డిస్ట్రీిబ్యూషన్‌ రంగంలో ఉంటూ.. ఇటీవల నిర్మాతగా మారిన సి. హెచ్‌. వినోద్‌ రెడ్డి కలిసి సీతారామరాజు, సురేష్‌ వర్మ సహాయంతో ఈ సినిమా హక్కుల్నితీసుకోవడం జరిగింది.

ప్రొడ్యూసర్‌ వినోదరెడ్డి గురించి?
– ఆయనకు డిస్ట్రిబ్యూటర్‌గా మంచి అనుభవం ఉంది. ఇటీవల నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ మంచి స్నేహితులను నిర్ణయించుకోవడం. యాద చ్చికంగా ఈ సినిమా ద్వారా నాకు మంచి స్నేహితుడు దొరికాడు.

ఇండస్ట్రీ నుండి మీకు ఏమైనా పోటీ ఎదురయ్యిందా?
– చాలా గట్టి పోటీనే ఎదురయ్యింది. మేము ఈ సినిమా రైట్స్‌ కొందాము అని ఆలోచిస్తున్న సమయంలోనే సుమారు 200 మంది వరకు ఈ సినిమా రైట్స్‌ కొరకు అక్కడికి వెళ్లడం జరిగింది. ఈ సినిమా క్రేజ్‌ కూడా రోజు రోజుకి పెరిగిపోతుండటం వల్ల రోజుకు పాతిక లక్షల వరకు రేటును పెంచడం జరిగింది. అలా పెరిగి మలయాళం లోనే అతి భారీ బడ్జెట్‌ సినిమాగా ‘ఒరు ఆధార్‌ లవ్‌’ నిలిచింది. అయినా బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా సినిమాపై ఉన్న ఫ్యాషన్‌తో మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను తెలుగులో విడుదలచేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది.

ఈ సినిమాకు ఇంత క్రేజ్‌ వచ్చింది కదా! స్క్రిప్ట్‌లో ఏమైనా చేంజెస్‌ చేశారా?
– ఒక చిన్న బడ్జెట్‌తో మొదలైన ఈ సినిమాకి ప్రపంచస్థాయిలో వచ్చిన క్రేజ్‌ను ద ష్టిలో పెట్టుకొని దర్శకుడు ఒమర్‌ లులు నిర్మాతల సహాయంతో కథనంలో చాలా మార్పులు చేశారు. విదేశాలలో పాటల చిత్రీకరణ జరిపి ఒక భారీ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.

దర్శకుడు ఒమర్‌ లులు గురించి చెప్పండి?
– ఇదివరకే అతను కొత్తవారితో మలయాళంలో రెండు సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన విషయం తెలిసిందే ..ఒమర్‌ లులుకి దర్శకుడిగా ఇది మూడవ సినిమా, హ్యాట్రిక్‌ సినిమా. ఈ సినిమాను కేవలం లవ్‌స్టోరీ లానే కాకుండా మంచిస్నేహానికి అర్థం చెప్పే విధంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.

రీషూట్‌ తరువాత సినిమా చూశారా?
– చూశాము. నేను, వినోద్‌ రెడ్డి వెళ్లి ఈ సినిమాను మలయాళం లోనే చూడడం జరిగింది. దర్శకుడు ఈ సినిమాకు 100 పర్సెంట్‌ అవుట్‌ఫుట్‌ ఇవ్వడంజరిగింది. సినిమా చూసిన తరువాత మాలో కాన్ఫిడెన్స్‌పెరిగి పబ్లిసిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ప్లాన్‌ చేయడం జరిగింది.

ఈ సినిమాలో నటీనటుల గురించి?
– దర్శకుడు ఒమర్‌ లులు కొత్తవారి ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఎప్పుడూ కొత్తవారితోనే సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. అలాగే ఈ సినిమాకు కూడా అందరిని కొత్తవారినే తీసుకోవడం జరిగింది. కానీ, ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ చాలా ఎక్స్‌పీరియన్సుడ్‌ ఆర్టిస్టుల్లా పెర్ఫామ్‌ చేశారు.

ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ గురించి చెప్పండి?
– మేము విడుదల చేసిన టీజర్‌, ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఇటీవల మేము విడుదల చేసిన మరో టీజర్‌ ఒక్క రోజులోనే 20 లక్షల మంది చూడడం చూస్తుంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ ఏంటో అర్ధమవుతుంది.

సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి?
– ఇది యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ కనుక పాటలకు మంచి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో 8 పాటలు ఉన్నా ప్రతీ పాట ఆడియో పరంగా, విజువల్‌గా కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో మేము ఇప్పటివరకు విడుదల చేయని ఇంకో పాట ఉంది. అది ఈ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుంది. ఆ పాటను థియేటర్‌లో చూస్తేనే బాగుంటుంది.

ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌కి అల్లుఅర్జున్‌ వచ్చారు కదా! మీ బ్యానర్‌లో ఆయనతో సినిమా ఉంటుందా?
– ఆ క్రెడిట్‌ అంతా మా వినోద్‌ రెడ్డి గారిదే. ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా అల్లుఅర్జున్‌ సినిమాలు చేశారు. ఆ అభిమానంతోనే అల్లుఅర్జున్‌ గారు రావడం జరిగింది. ఆయన రావడంతోనే మా సినిమా ప్రమోషన్స్‌ నెక్స్ట్‌లెవెల్‌కి వెళ్లాయి. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు. ఆయన మా బ్యానేర్‌లో నటిస్తాను అంటే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here