మాస్‌ మహరాజ రవితేజతో ‘భద్ర’, విక్టరి వెంకటేష్‌తో ‘తులస’ి నటసింహ బాలకృష్ణ తో ‘సింహా’, ‘లెజెండ’్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘జయ జానకి నాయకా’ ఇలా వరస విజయాలతో సంచలనం సృష్టించిన మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను-మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ ఫస్ట్‌ క్రేజి కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా జనవరి 11న వస్తున్న కమర్షియల్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వినయ విధేయ రామ’. శ్రీమతి డి. పార్వతి సమర్పణలో స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న సందర్భంలో సెన్సెషనల్‌ మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను ఇంటర్వ్యూ.

ఈ సినిమాలో రాముడు ఎవరికి విధేయుడు?
-వినయం విధేయత ఉంది కాబట్టే రాముడయ్యాడు. ఈ రాముడు ఫ్యామిలీ పట్ల విధేయుడు. ఆ విధేయత ఏ స్థాయిలో ఉంటుందనేది మీరు సినిమాలో చూస్తారు.

సినిమా కోసం ఎక్కువగా టైం తీసుకున్నారు?
-ఈ సినిమా ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ కటౌట్‌ చూస్తుంటే ఐరన్‌ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. ఆ బాడీలో ఈ రోజు ఉన్న మెచ్యూరిటీ నాలుగేళ్ల క్రితం లేదు. అందుకే పర్ఫెక్షన్‌ కోసం టైమ్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా, సంక్రాంతి పండుగలో ఉండే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి కాబట్టి ఈ సినిమాకు ఇదే కరెక్ట్‌ టైమ్‌.

మీ సినిమాలలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కే ఎక్కువ ప్రాదాన్యమిస్తున్నారు?
– నేను చేసిన సినిమాలు ‘భద్ర’ నుండి బిగిన్‌ అయితే ‘వినయ విధేయ రామ’ వరకు ఫ్యామిలీ మోషన్స్‌కే ఫస్ట్‌ ఫౌండేషన్‌ ఉంటుంది. ఆ తరవాత సొసైటీ గురించి.. కథలో ఇంకా స్కోప్‌ ఉందనుకుంటే తక్కిన విషయాల గురించి ఆలోచిస్తా.

అజర్‌ బైజాన్‌ ఎపిసోడ్‌ గురించి?
– అజర్‌ బైజాన్‌ సీక్వెన్స్‌ ప్రిపేర్‌ చేసుకుని రామ్‌ చరణ్‌ కి చెప్పినప్పుడు, అప్పటికే 2 నెలల కన్నా ఎక్కువ టైమ్‌ లేదు. ఇప్పట్లో కష్టం అని నాకు తెలిసినా, మీరు చేసేస్తారు అని ఒక మాట అనేసి వెళ్ళిపోయా. ఆయన కూడా ఆ మాటని అలాగే తీసుకుని అంతలా కష్టపడ్డాడు కాబట్టే ఆ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌ అయ్యింది.

కథలో మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంటుందా?
– సినిమా అంటే పండుగ. ఆ పండుగని అభిమానుల వరకు చేర్చాలంటే ఆర్టిస్ట్‌ నన్ను నమ్మాలి. వాళ్ళు నన్ను నమ్మాలంటే వాళ్ళకన్నా ముందు నేను పదింతలు ఎక్సర్‌ సైజు చేసి, వాళ్ళను ఇన్స్‌ఫైర్‌ చేయగలగాలి. ఈ ప్రాసెస్‌లో ఆర్టిస్టుల కన్నా కథలో నేనే ఎక్కువగా ఇన్వాల్వ్‌ అవుతాను. కథ చెప్పేటప్పుడే ఎఫెక్ట్స్‌తో సహా ఎక్స్‌ప్లేన్‌ చేస్తాను. మాస్‌, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు సినిమాలో సోషల్‌ ఎవైర్‌నెస్‌కి సంబందించిన ఒక కొత్త పాయింట్‌ని వినయ విధేయ రామలో రైజ్‌ చేయడం జరిగింది. అది ఆడియెన్స్‌కి బాగా రీచ్‌ అవుతుంది.

రామ్‌ చరణ్‌లో మీకు బాగా నచ్చిన అంశం?
– నాకు రామ్‌ చరణ్‌ లో ఎక్కువగా నచ్చింది ఒకటే. ఆయనకీ అసలు సంత ప్తి అనేదే ఉండదు. ఎంత సాధించినా ఇంకా ఏదో చేయాలి అనే తపన తనలో కనిపిిస్తుంది. సినిమా సినిమాకి ఎదుగుతూనే ఉన్నాడు. అయినా ఇంకా డెడికెటెడ్‌గా వర్క్‌ చేస్తుంటాడు. ‘వినయ విధేయ రామ’ విజన్‌ నుండి విజువల్‌ వరకు ఉన్న మెయిన్‌ కనెక్టివిటీ రామ్‌ చరణ్‌.. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్‌ సాధ్యపడేది కాదు.

ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి గురించి?
– నేను ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్స్‌దే ప్రధాన పాత్ర అని నమ్ముతాను. జ్యూస్‌ నాదైనా గ్లాస్‌ ప్రొడ్యూసర్‌గారిదే. అందుకే రామ్‌ చరణ్‌, నాకు దానయ్య గారైతేే బెటర్‌ అని చెప్పడం జరిగింది. సినిమా ఈ రోజు ఇంత అద్భుతంగా వచ్చిందంటే అది దానయ్య డి.వి.వి గారి వల్లే పాిబుల్‌ అయింది.

చాలా కాలం తరువాత ప్రశాంత్‌ రీఎంట్రీ గురించి?
– సినిమాలో క్యారెక్టర్స్‌ కూడా ఎవరు అందుబాటులో ఉన్నారో వారిని తీసుకోవడం జరగలేదు. ఒక ఐ.ఎ.యస్‌ ఆఫీసర్‌, హీరోకి పెద్దన్నయ్య అన్నప్పుడుఎవరిని తీసుకున్నా ఈ క్యారెక్టర్‌లో పర్ఫెక్ట్‌గా సింక్‌ అవ్వాలి. అందుకే ప్రశాంత్‌ గారిని తీసుకోవడం జరిగింది. అలా వరసగా ఏజ్‌ దగ్గరి నుండి పర్ఫామెన్స్‌ లెవెల్స్‌ వరకు ప్రతీది క్షుణ్ణంగా ఆలోచించి డెసిషన్‌ తీసుకోవడం జరిగింది.

వివేక్‌ ఒబెరాయ్‌ని నెగెటివ్‌ షేడ్స్‌లో చూపించారు?
– వివేక్‌ ఒబెరాయ్‌గారినిని కలిసినపుడు ఆయన అన్న మొదటి మాట ‘నేను చేయను’. నేను ‘రక్త చరిత్ర’ సినిమా చేశాను. మళ్ళీ అదే స్థాయి సినిమా అయితే తప్ప ..నేను ఆలోచించనండి! అని చెప్పాడు. సరే సర్‌.. మీరు చేయకండి కానీ, ఒకసారి క్యారెక్టర్‌ వినండి అని చెప్పాను. అంతే 20 నిమిషాలు విన్నాడో లేదో.. క్యారెక్టర్‌ నచ్చి వెంటనే డేట్స్‌ ఇచ్చేశాడు. అదే కమిట్‌ మెంట్‌తో వచ్చి షూటింగ్‌ చేసి వెళ్ళిపోయారు.

మీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌?
ఎన్‌.బి.కె ఫిలింస్‌లో నందమూరి బాలకృష్ణ గారి సినిమా . రామ్‌ చరణ్‌తో ఒక సినిమా ఉంటుంది. మెగాస్టార్‌ గారి కోసం ఒక కథ రెడీగా ఉంది.