భీమవరం టాకీస్ నుంచి సినిమా వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్ లు సేఫ్ జోన్ లో ఉన్నటే . ఎందుకంటే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు సేఫ్ బడ్జెట్ లో క్వాలిటీ సినిమాలు నిర్మిస్తారు. వంద సినిమాల చేరువలో ఉన్న భీమవరం టాకీస్ ఇప్పుడు రహస్యం చిత్రం తో మన ముందుకువస్తున్నారు.

సాగర్‌ శైలేష్, శ్రీ రితిక జంటగా ‘జబర్దస్త్‌’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రహస్యం’. సాగర శైలేశ్‌ దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. టాప్ డైరెక్టర్స్ అయినా రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్ మరియు మారుతీ గారు ఈ సినిమా యొక్క ట్రైలర్లు విడుదల చేసి ఈ సినిమా విజయవంతం అవ్వాలని అభినందించారు.

ఇప్పుడు హీరో శ్రీకాంత్ ఈ రహస్యం సినిమా ప్రమోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ “తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మంచి నిర్మాత. అయన మంచి ప్లానింగ్ తో సినిమా ని విడుదల చేస్తారు. ఈ రహస్యం సినిమా ట్రైలర్ చూసాను చాలా బాగుంది, మంచి విజయం సాదించాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘మా దర్శకుడు సాగర్‌ శైలేష్‌ ప్రాణం పణంగా పెట్టి ఈ సినిమా తీశారు. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ అయినా రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, మారుతీ మరియు రాజ్ కందుకూరి గార్లు ఈ సినిమా యొక్క ట్రైలర్లు విడుదల చేసారు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరో శ్రీకాంత్ గారు మా సినిమా ప్రమోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. వారికీ నా కృతఙ్ఞతలు. సినిమా చాల బాగా వచ్చింది, జనవరి లో విడుదల చేస్తాం ” అని తెలిపారు.

ఈ సినిమాలో శైలేశ్‌, రితిక జంటగా నటించారు. సాగర శైలేశ్‌ దర్శకుడు , తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మాత.