క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న హావా మూవీ టాలీవుడ్ ప్రముఖుల మెప్పు పొందుతుంది. తొమ్మిది గంటలు లలో జరిగే ఈ కథ ని తెలుసుకొని దర్శకుడు శేఖర్ కమ్ముల టీం ని ప్రశంసించారు. కాన్సెప్ట్ పొస్టర్ ని లాంఛ్ చేసిన సందర్భంగా
శేఖర్ కమ్ముల మాట్లాడుతూః
సినిమా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందిస్తుందని నమ్ముతున్నాను. టీం కి నా అభినందనలు అన్నారు.
హీరో చైతన్య మాట్లాడుతూః
శేఖర్ గారిని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సినిమాలంటే మాకు విపరీతమైన అభిమానం. మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ని ఆయన చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. మా టీం కి ఇది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది అన్నారు.
దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూః
క్రైమ్ బ్యాక్ డ్రాప్ వచ్చి న సినిమాలలో హావా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కాన్సెప్ట్ తెలుసుకొని శేఖర్ కమ్ములు గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త తరహా కథ, కథనాలకు ప్రేక్షకులనుండి తప్పకుండా ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాము. శేఖర్ గారు మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్నారు.
హావా లోగో అండ్ మోషన్ టీజర్ ని రానా విడుదల చేసారు. చిన్న సినిమా గా మొదలైన హావా ప్రయాణం టాలీవుడ్ ప్రముఖులను ఆకర్షిస్తుంది. Nine Brains..Nine Crimes.. Nine hours. ఈ కాప్షన్ టాలీవుడ్ లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ తొమ్మిది మంది చేసిన నేరాలేంటి.. వారి జీవితాలు ఎలా మారాతాయనే కాన్సెప్ట్ ని థ్రిల్లింగ్ ప్రజెంట్ చేసాడు దర్శకుడు మహేష్ రెడ్డి. ఈ సినిమా అంతా ఇప్పటి వరకూ చూడని లోకేషన్స్ లో చిత్రీకరణ జరపుకుంది. ఆస్ట్రేలియాకి చెందిన కొందరు నటీ నటులు ఈ సినిమా లో కనిపిస్తారు. మోషన్ టీజర్ కి లోగో కి మంచి స్పందన వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకొని శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీలో సాంగ్స్ మధురా ఆడియో ద్వారా విడుదలకు సిద్దం అవుతున్నాయి.
ఈ సినిమాలో చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటిస్తుండగా. స్టీఫెన్ మార్పీ, జో జోసెఫ్, ఫిబి జాకోబర్, సందీప్ పగడాల, కమల్ కృష్ణ, అన్య మేయర్, ఆల్వన్ జూనియర్, విలియమ్ ట్రేన్ , శ్రీజిత్ గంగాధర్ ఇతర పాత్రలలో నటించారు.
టెక్నికల్ గా హై స్టాండర్స్ లో ఉండబోతున్న ఈ మూవీ కి ఎడిటర్ః కార్తీక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీః సంతోష్ షానమోని, సంగీతం ః గిఫ్టన్ ఎలియాస్, సాహిత్యంః లక్ష్మీ ప్రియాంక, పిఆర్వోః జియస్ కె మీడియా, నిర్మాణం ః ఫిల్మ్ అండ్ రీల్స్, దర్శకత్వం ః మహేష్ రెడ్డి