‘దేవదాస్’లో అద్భుతమైన వినోదంతో పాటు.. మంచి భావోద్వేగాలు ఉంటాయి – నాచురల్ స్టార్ నాని

0
63

నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్ ‘దేవదాస్’.ఈ సినిమాలో నాగ్, నాగార్జున ఫ్రెండ్స్ లా కనిపించనున్నారు. యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా, ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో నాని మీడియాతో మాట్లాడారు.

*‘దేవదాస్’ అన్ని రకాలుగా ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి. నాగార్జున గారితో పని చేయడం ఫస్ట్ టైమ్, మల్టీస్టారర్ చేయడం కూడా ఫస్ట్ టైమ్..ఈ సినిమాకి నేను సైన్ చేస్తున్న క్షణంలోనే.. నా మైండ్ లో రకరకాల ప్రశ్నలు.. అసలు నాగ్ సార్ తో ఎలా ఉండాలో.. ఆయన నన్ను ఎలా ట్రీట్ చేస్తారో.. మా కాంబినేషన్ లోని సీన్స్ షూట్ చేసే సమయంలో ఎలా ఉంటుందో అని నేను చాలా భయపడ్డాను. కానీ ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. యాక్ట్ చెయ్యడానికి ఎదుటి వ్యక్తికి ఎప్పుడు స్కోప్ ఇచ్చే వ్యక్తి ఆయన. రేపు సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు నా పాత్రను ఇష్టపడినట్లయితే, ఆ క్రెడిట్ మొత్తం నాగ్ సర్ కే చెందుతుంది.

*ఐఫా అవార్డుల‌ను నేను, రానా క‌లిసి హోస్ట్ చేశాం. ఆ అవార్డుల వేడుక‌కు అమ‌ల‌గారితో వ‌చ్చారు నాగార్జున‌. అప్పుడు ఓ యాంక‌ర్ ఆయ‌న ముందు మైక్ పెట్టి నాని యాంక‌రింగ్ గురించి చెప్పండి అని చెప్పింది.. దాంతో ఆయ‌న తెలుగు బాగా మాట్లాడ‌తాడు.నాకిష్టం అని అన్నారు. ఆయ‌న్ని తోసుకున్న‌ట్టుగా.. కాస్త అమ‌ల‌గారు ముందుకొచ్చి తెలుగు ఎంతో బాగా మాట్లాడ‌తాడు అని అన్నారు. ఆ క్లిప్పింగ్‌ని నాకు ఎవ‌రో పంపారు. నేను మా ఇంట్లో వాళ్ల‌కు కూడా చూపించాను. నా మీద ఆయ‌నకున్న ఇంప్రెష‌న్ పోకుండా చూసుకోవాల‌ని అనుకున్నా. అంత‌కు ప‌దింత‌లు మార్కులు కొట్టేశాన‌ని మాత్రం తెలుసు.

*ఏ హీరోతో అయినా మల్టీస్టారర్ చేయొచ్చు. కానీ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి టాప్ మోస్ట్ స్టార్స్ తో పని చేయాలంటే చిన్న బెరుకు ఉంటుంది.మిగిలిన అంద‌రు హీరోల‌నూ క్లాస్ మేట్స్ గానే చూడొచ్చు. కాక‌పోతే వాళ్లు ఫ్రెండ్ బెంచ్‌లో కూర్చుంటే, నేను బ్యాక్ బెంచ్‌లో కూర్చున్న‌ట్టు ఫీల్ కావ‌చ్చు. కానీ ఈ న‌లుగురిని మాత్రం అలా చూడ‌లేం.

*ఎంటర్ టైనర్ కాబట్టి, ఆబివియస్ గా ఆన్ లొకేషన్ లో చాలా ఇంప్రువైజేషన్స్ ఉంటాయి. స్పాట్ లో అక్కడ ఉన్న మూడ్ ని బట్టి, ప్రాప్ ని బట్టి చాలా మారిపోతుంటాయి. నాగ్ సర్ కి ఏ ఐడియా చెప్పినా, హ్యాప్పీగా నవ్వేసి దాన్ని ఇంకా ఇంప్రువైజ్ చేసి ఎంకరేజ్ చేసేవారు…

*శ్రీరామ్ ఆదిత్య ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఇక ఈ స్టార్ డమ్ గురించి, ఇమేజ్ గురించి నేను పెద్దగా ఆలోచించను. ఇలాంటి మంచి సినిమాలు చేస్తేనే.. ఇంకా మంచి కథలు వస్తాయి. అన్నిటికి మించి నాకు నాగార్జునగారి పక్కన నటించే అవకాశం వచ్చింది. దాంతో పాటు వైజయంతి బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును ఎలా వదులుకుంటాం.

*ఈ కథ చాలాకాలంగా వైజయంతి బ్యానర్ లోనే ఉంది. మాకు శ్రీధ‌ర్ రాఘ‌వ‌న్ క‌థ చెప్పిన‌ప్పుడు దాదాపు 20 ప‌ర్సెంట్ బావుంద‌నిపించింది. దాన్ని తెలుగుకు త‌గ్గ‌ట్టు డెవ‌ల‌ప్ చేయాలి. మ‌రీ రియ‌లిస్టిక్‌గా చేయాలి. అలాగే కాస్త క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కూడా ఉండాలి. అలా చేయ‌గ‌లిగిన వాళ్లు ఎవ‌రైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్న‌ప్పుడు నేను శ‌మంత‌క‌మ‌ణి ట్రైల‌ర్ చూశాను. నాకు శ్రీరామ్ వర్క్ చాలా బాగా నచ్చింది. తన్ని పిలిచి, ఈ కథ చెప్పి ఫైనల్ డ్రాఫ్ట్ తో రావాలని కోరాము. తను కథ పై వర్క్ చేశాడు. ‘ఎమ్.సి.ఎ’ షూట్ సమయంలో తను నాకు పూర్తి స్క్రిప్ట్ ను వినిపించాడు, అప్ప‌టికే నేను రెండు, మూడు సినిమాల‌తో స‌త‌మ‌త‌మవుతున్నా. స్క్రిప్ట్ ఏమాత్రం బాగాలేకున్నా సారీ చెప్పేద్దామ‌ని అనుకున్నా. నాకు చాలా బాగా నచ్చింది. నాగ్ సార్ కి కూడా నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. శ్రీరామ్ చాలా సమర్ధవంతమైన దర్శకుడు. మమ్మల్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు.

*‘దేవదాస్’లో అద్భుతమైన వినోదంతో పాటు.. మంచి భావోద్వేగాలు కూడా ఉన్నాయి. సరదాగా సాగే సన్నివేశాలు కడుపొబ్బా నవ్విస్తాయి. క‌న్నీళ్లు తెప్పించే అంశాలూ ఉంటాయి. మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. దేవ మరియి దాస్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుటుంది. సినిమాకి ప్రత్యేకంగా నిలుస్తోంది.

*నా కటౌట్ చూసి ఆడియెన్స్ నా సినిమాకి రారు… నాకా క్లారిటీ ఉంది. సినిమాను సినిమాగా చూడ్డానికి వ‌స్తారు. నాకంటూ నా చుట్టూరా నాకో ఇమేజ్ నేనెప్పుడూ క్రియేట్ చేసుకోలేదు.. అలాంటప్పుడు మల్టీస్టారర్ అంటే రిస్క్ అనే ఆలోచన నాకెప్పుడూ లేదు.. అలా అనుకునే ఈ సినిమా చేశా. నాగ్ సార్ యాడ్ కావ‌డం చాలా పెద్ద ప్ల‌స్ పాయింట్‌.

*‘కృష్ణార్జున యుద్ధం’ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, దాని మీద మేం చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ ప్రేక్షకులకు ఆ చిత్రం నచ్చలేదు. మా ప్రయత్నపరంగా అయితే మాత్రం, ఎక్కడా లోపం జరగలేదు. 100% పర్సెంట్ మేం హార్డ్ వర్క్ చేశాము. నేను, గాంధీ కూర్చుని స్క్రిప్ట్ ప‌రంగా ఇంకాస్త ఏమైనా చేసి ఉండాల్సింది అని అనుకున్నాం. అంత‌కు మించి ఇంకేమీ అనుకోలేదు. కానీ ట్విట్ట‌ర్‌లో సినిమా బావుంద‌ని చాలా మంది కామెంట్లు పెట్టారు. అయినా జీవితంలో ఎదుగుతున్నప్పుడు.. కొన్ని ఎదురు దెబ్బలు, అడ్డంకులు ఎదురవుతాయి. ‘కృష్ణార్జున యుద్ధం’ ప్లాప్ కూడా నా ఎదుగుదలకి వచ్చిన చిన్న అడ్డంకి అనుకుంటున్నాను. దిష్టి పోయింద‌నుకున్నా.

*దత్ గారితో కలిసి పని చేయడం నాకిదే ఫస్ట్ టైమ్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చేసినా ఆయనతో ఇంటరాక్ట్ అయింది తక్కువే. కానీ ఆ సినిమా తరవాత నా సినిమాల‌ను మొద‌టిరోజు చూసి జెన్యూన్ రిపోర్ట్ ఇస్తుంటారు. అసలు వైజయంతీ బ్యానర్ కి ఇంత రెస్పెక్ట్ ఎందుకు..? ఎందుకు ఇంత పెద్ద స్టార్స్ ఈ బ్యానర్ లోనే ఇంట్రడ్యూస్ అయ్యారు అనే క్వశ్చన్ ఉండేది. ఆయనతో పని చేశాక నాకు బాగా క్లారిటీ వచ్చేసింది. సెట్లో ఏమైనా కావాలంటే అస‌లు ఎక్క‌డా వెన‌కాడ‌రు. సినిమా అంటే ఆయ‌న‌కు అంత ప్యాష‌న్‌.

*జెర్సీ షూటింగ్ విజ‌య‌ద‌శ‌మికి మొద‌ల‌వుతుంది. ఈ సినిమా కోసం వర్కవుట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ప్ర‌తిరోజూ మూడున్న‌ర గంట‌ల సేపు ట్రెయినింగ్ తీసుకుంటున్నా. బ్యాట్స్ మ్యాన్‌గా క‌నిపిస్తా. చిన్న డీటేల్ కూడా వదలకుండా 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాం ఈ సినిమాని. నా కెరీర్‌లో నేను గుర్తుంచుకునే సినిమా అవుతుంది,

*‘బిగ్ బాస్’ నా పై చాలా ప్రభావం చూపింది. నా చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎలా ఉండాలి, ఎంత మృదువుగా మాట్లాడాలి, ఇలా చాలా విషయాల్లో బిగ్ బాస్ నాలో మార్పు తీసుకొచ్చింది. ఒక విధంగా నా జీవితంలో కొత్త కోణం చూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here