కింగ్ నాగార్జున అక్కినేని నాచురల్ స్టార్ నాని ల క్రేజీ మల్టీ స్టారర్ ‘దేవదాస్’ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27 న విడదల కి సిద్ధం అవుతోంది. మెగా మేకర్ సి అశ్వినీదత్ ప్రతిష్టాత్మక వైజయంతి సంస్థ లో యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. వయాకామ్ 18 సంస్థ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున దేవదాస్ గురించి పంచుకున్న విశేషాలు….
*ఈ చిత్రంలో నేను డాన్ పాత్రలో నటించాను అలాగని ఈ సినిమాలో డాన్ చేసే సెటిల్ మెంట్స్ లాంటి పనులేమీ ఉండవు. దేవదాస్ సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్ షిప్ స్టోరీ. నాకూ, నానీకి మధ్య ఫ్రెండ్షిప్, మేమిద్దరం ఎలా కలుసుకున్నది ఉంటుంది. ఇద్దరం మంచి స్నేహితులం అవుతాం. ఆ తరువాత వారు ఏ రకమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేదే మిగితా స్టోరీ
*ఒకానొక సంధర్భంలో నేను పేషేంట్ గా డాక్టర్ నాని కలుస్తాను. దేవకి డ్రింకింగ్ ఇష్టం. దాస్ తాగడు. బెదిరించి తాగిస్తాడు. రెండూ ఎంటర్టైన్మెంట్ కేరక్టర్లే. మున్నాబాయ్ ఎమ్ బి బి ఎస్ తరహాలో హిలేరియస్ గా సాగుతుంది.
*పర్సనల్‌గా నాకు నాని తక్కువగా తెలుసు. కానీ చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు. మా ఇద్దరి మధ్య కెమిస్ర్టీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది.
*సినిమాలో ఆకాంక్షతో నా లవ్ స్టోరీ చాలా బాగుంటుంది . ఆమె న్యూస్ రీడర్. ఆ అమ్మాయిని కాలేజ్ డేస్ నుండి తనను లవ్ చేస్తుంటాడు కానీ చెప్పడు. ఎవరికీ భయపడని డాన్ అయినా, అమ్మాయి కనిపించగానే తడబడతాడు. నోట మాటరాదు. మేనరిజమ్ మారిపోతుంది. అలాంటిది వాళ్లిద్దరినీ నాని కలుపుతాడు.
*ఇండస్ట్రీ లో ఇప్పటికే 32 ఏళ్లున్నా. డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది. నా ఏజ్ ను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు. అలాగే ఈ మల్టీ స్టారర్ చిత్రాలు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తాయి. మల్టీస్టారర్ అనగానే ఆబివియస్ గా ప్రెజర్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి. తేడా జరిగితే ఇద్దరు కలిసి హిట్ కొట్టలేకపోయారు అనేస్తారు. అందుకే మల్టీస్టారర్ స్టోరీస్ ఇంకా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
*ధనుష్ తో తెలుగు, తమిళ్ బైలింగ్వల్ లో చేస్తున్నాను. హిందీ బ్రహ్మాస్త్ర కూడా, మల్టీస్టారరే. మల్టీస్టారర్స్ తో పాటు సోలో సినిమాలు కూడా చేస్తాను. ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్ లోనే ఇంకో సినిమా ప్లానింగ్ జరుగుతుంది. అది మల్టీస్టారర్ కాదు.
*దేవదాస్ ఒరిజినల్ స్టోరీ రెండేళ్ల క్రితం ముంబై రైటర్ శ్రీధర్ రాఘవన్ చెప్పడం జరిగింది. ఈ కథ ముందు నా దగ్గిరకి వచ్చినప్పుడు ‘కథ బావుందండీ. కోస్టార్ చక్కగా కుదరాలి’అని చెప్పాను. శ్రీరామ్ ఆదిత్య పేరును నానిని సజెస్ట్ చేసినట్టున్నాడు .శ్రీరామ్ చాలా మంది రైటర్స్ హెల్ప్ తీసుకుని స్టోరీని డెవెలప్ చేసుకున్నాడు. ఆ తర్వాత నాని, దత్తుగారి అమ్మాయి స్వప్న వంటివారందరూ చూసుకున్నారు. ఎందుకంటే స్వప్న ఈ మధ్యనే మహానటి తీసింది. వాళ్లకి సినిమా అంటే ప్రేమ ఉంది. ఈ సినిమా టీమ్ వర్క్.
*దేవ క్యారెక్టర్ చాలా బావుంటుంది. ఎప్పుడు చూసినా చాలా ఎనర్జిటిక్ గా నవ్వుతూ ఉంటాడు. కానీ తన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఆ బాధ కానీ బయట పడకుండా బ్రతికేస్తుంటాడు. క్లైమాక్స్ వచ్చేసరికి అంతా క్లియర్ అయిపోతుంది… అద్భుతమైన క్యారెక్టర్..
*నాకిప్పుడు 59 ఏళ్లు. గత 30 ఏళ్లుగా ఏమేం వ్యాయామాలు చేస్తున్నానో, అదే ఇప్పుడు కూడా చేస్తున్నా. నేను మానసికంగా 25ని ఎప్పుడూ దాటలేదు. ఎప్పుడూ అలాగే ఆలోచిస్తా. నిద్ర లేచినప్పుడు అలాగే లేస్తా. ‘నువ్వింకా పాతికేళ్ల కుర్రాడివి అనుకుంటున్నావ్’ అంటుంటుంది అమల. ‘నిజమే. అలా ఆలోచిస్తున్నాను కాబట్టే అఖిల్‌ని, చైతూని డీల్ చేస్తున్నా’అని అంటాను. నిజమే. నేను పాతికేళ్ల కుర్రాడిలాగానే ఆలోచిస్తా. నేను చైతన్య కన్నా యంగ్‌గా ఆలోచిస్తా. వాడే నన్ను కూర్చోబెట్టి సలహాలు ఇస్తుంటాడు.
*నాకు చాలా సంవత్సరాలనుండి వైజయంతి మూవీస్ తో మంచి అనుభందం వుంది. వైజయంతీ బ్యానర్ లో చేసిన ఫస్ట్ సినిమా ‘ఆఖరిపోరాటం’. ఆ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ అనగానే, ఇంక సినిమాలో నాకేముంటుందని అన్నా. అలాంటి సమయంలో దత్తుగారు తెలివిగా నాన్నగారి దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి ‘ఆమె చాలా పాపులర్. ఆమెతో కలిసి పనిచేస్తే, నీ పాపులారిటీ కూడా పెరుగుతుంది. ఈ అవకాశాన్ని అందుకో. తెలుగు సినిమాలో హీరో అనగానే ఏం చేయాలో, ఏం ఉంటే బావుంటుందో దత్తుగారికి, రాఘవేంద్రరావుగారికి అన్నీ తెలుసు. వాళ్లు చేస్తారు. నువ్వు ఒప్పుకో ’ అని అన్నారు.
*అశ్వినీదత్ గారు నాకు చాలా క్లోజ్. ఆయనతో లాస్ట్ సినిమా ‘రావోయి చందమా’ చేసి. దాదాపు 18 ఏళ్లయింది. దత్ గారకి సినిమా చాలా పెద్ద ప్యాషన్. ఆయన తీసిన సినిమాలను చూస్తే, ఇంకే తెలుగు సినిమా నిర్మాతకూ అన్ని వైవిధ్యమైన సినిమాలు లేవు. ఇటీవల ‘మహానటి’చేశారు. అందులో చైతూ నాన్నగారిలాగా కనిపించారు. అయితే ఆ సినిమాను ఆయన ఇద్దరమ్మాయిలు, అల్లుడు చేశారని ఆయనే చెబుతారు. ‘మా వైజయంతీ మూవీస్‌కి మీరు చేసి పెట్టాలి. ఇది నా కమ్‌బ్యాక్ సినిమా’అని అనగానే ‘మీకు కమ్‌బ్యాక్ ఏంటండీ.. ఎప్పుడూ కమ్ ఫార్వర్డేగానే’ అని అన్నా. దేవదాస్ నాకు సొంత సినిమా లాంటిదే.
*శ్రీరామ్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ప్రతీది ప్లాన్డ్ గా చేసుకొచ్చాడు. ‘ఇది ఆది సినిమా. అతను చేయాలి’ అని అనుకున్నాం. సెట్స్ పైకి రాకముందు ఏదైతే అనుకున్నామో అదే స్క్రీన్ పై జెనెరేట్ చేశాడు. ఇది టీమ్ వర్క్. అందువల్ల తనకు ప్లస్ అయింది. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సిననిమాలో స్టార్స్ ఉన్నారు, మంచి బడ్జెట్ ఉంది.. ఇవన్నీ తనకు బాగా ప్లస్ అవుతాయి.
*నాని సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అలా మొదలైంది, ఎవడే సుబ్రమణ్యం, మజ్ను, నిన్నుకోరి, ఎంసీఏ, ఈగ… ఇవన్నీ చూశా. ఎంత న్యాచురల్ గా ఉంటాయో అంత మ్యాజిక్ ఉంటుంది ఆ సినిమాల్లో. నాకు సినిమాల్లో లార్జర్ దేన్ లైఫ్ కనిపించాలి. అలాంటివే ఇష్టం. నేను చూసిన నాని సినిమాల్లో ఆ మేజిక్ ఉంటుంది. రియల్‌గా ఉంటూ మేజిక్ కూడా కనిపిస్తుంది.
*నేను చాలా సార్లు గమనించాను నాని ఎప్పుడు ఫోన్ తోనే బిజీ గా ఉంటాడు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. రాత్రుళ్లు కూడా చెవికి ఫోన్ తగిలించుకుని నిద్రపోతాడేమో. ఇది డిజీజ్ అయింది సార్.. ఎలా బయటికి రావాలి అని తనే అంటాడు. నాని అనే కాదు మనకు తెలిసి చాలా మంది ఇలాగే వుంటారు. వారు వాళ్ళ చుట్టూ పక్కల ఏం జరిగిన పట్టించుకోరు. వల్ల బిజీలో వారు ఉండిపోతారు.
*ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో సుమంత్ లుక్ చాలా బాగుంది. అచ్చం నాన్న గారిలాగే వున్నాడు. తను చిన్నప్పటి నుంచి నాన్నగారితో కలిసి పెరగడం వల్లనో ఏమో తనకి నాన్న మేనరిజమ్స్ చాలా తెలుసు. మాట్లాడే విధానం, నడిచే విధానం వంటివన్నీ. ఆయనకు సుమంత్ అంటే చాలా ఇష్టం. ఈ విషయంలో క్రిష్ ను అభినందించాల్సిందే. స్క్రీన్ మీద నాన్న గారి పాత్రను చూడాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
*బంగార్రాజు, రాహుల్ రవీంద్రన్ రెండూ స్క్రిప్టులు జరుగుతున్నాయి. రాహుల్ దర్శకత్వంలో చేసే సినిమా మన్మథుడు2 అనేది కాదు. ఈచిత్రాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. ఆ టైటిల్ బావుంటుందని రిజిస్టర్ చేశాం. అది నాకు కావచ్చు, చైతూకి కావచ్చు, అఖిల్‌కి కావచ్చు.
*నాన్నగారి దేవదాసుకి ఈ దేవదాసుకి అస్సలు సంబంధం లేదు. ఒక్క బాటిల్ తప్పితే ఏ సంబంధమూ లేదు. పాతది ప్రేమ దేవదాస్, ఇది కంప్లీట్ గా లాఫింగ్ దేవదాస్. తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా నచ్చిన, తెలిసిన టైటిల్. ఆ బేసిస్ మీద సినిమా చేశాం.
*దాదాపు 15 ఏళ్ల తర్వాత నేను బాలీవుడ్లో బ్రహ్మాస్త్ర చేస్తున్నా. మధ్యలోనూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేను చేయలేదు. ఇప్పుడు నచ్చి చేస్తున్నా. నా రోల్ 600 ఏళ్లకు ముందు రోల్. ఇంకా షూటింగ్ కాలేదు. రామోజీ ఫిల్మ్‌సిటీలో చేస్తారు. నా జీవితంలో నేను చేసిన పొరపాట్లకు నాకేమీ పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు. 95 శాతం స్టార్టప్‌లు ఫ్లాపుల్లో ముగుస్తాయి. నా విషయంలో అలాంటిదేమీ కాలేదు. కొన్నిసార్లు తప్పు కూడా అవుతాయి.
*ఏమో ఏమో పాట ఉంది నాకు చాలా బాగా నచ్చింది. ఆ పాటను నానికి పెట్టారు. వారూ వీరూ వంటివన్నీ బావున్నా నాకు సిద్శీర్రామ్ పాడిన పాట మాత్రమే నచ్చింది. అసలు ఆ వాయిస్ ఎంత బావుందండీ. ‘ఏమాయ చేశావే’లో ‘ఆరుమోళే’ అని ఓ పాట ఉంది. అక్కడి నుంచి అతని సాహసం శ్వాసగా సాగిపోలో ‘వెళ్లిపోమాకే’ అని ఓ పాట పాడాడు. ఆ తర్వాత ‘గీత గోవిందం’.. చేశాడు. శ్యామ్ మా సినిమాకు చాలా పెద్ద అసెట్. ఫొటోగ్రఫీ మాత్రమే కాదు, శ్రీరామ్ ఆదిత్యను కూడా చాలా హెల్ప్ చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన వారిలో నాకు శ్యామ్‌తో మళ్లీ చేయాలని ఉంది. అంత సైలెంట్‌గా ఉంటాడు. మంచి మనిషి. ఆల్ రౌండర్ అతను.
*అంబేద్కర్ బయోపిక్ గురించి అడిగారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి పర్సనల్ సెక్రటీ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అది నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌సీరీస్ చేస్తున్నారు. చాలా బ్యూటీఫుల్‌గా చేశారు. కానీ నాకు సమయం లేక చేయలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు అన్ని విభాగాల రాజులను కలిసి వాళ్ల చేత పేపర్ల మీద సంతకాలు పెట్టించిన వ్యక్తి పాత్ర అది. చాలా బావుంటుంది.
*రెండేళ్ల క్రితమే కరణ్‌జోహార్ అఖిల్‌కి ఆఫర్ ఇచ్చాడు. కరణ్‌కి అఖిల్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. వాళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నేను కరణ్‌కి సింపుల్‌గా చెప్పింది ఏంటంటే ‘తెలుగులో మేం ఓ సినిమా చేస్తాం’, తర్వాత నువ్వు హిందీలో చెయి్ అని అన్నా. అంతకు మించి ఇంకేమీ మాట్లాడుకోలేదు.