పేపర్ బాయ్ చిత్రాన్ని ప్రతిఒక్కరూ అప్రిషేయట్ చేస్తున్నారు…కథా రచయిత – నిర్మాత సంపత్ నంది.

0
109

సంతోష్ శోభన్ , రియా సుమన జంటగా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్ , ప్రచిత్ర క్రియేషన్స్ బ్యానర్లు పై సంపత్ నంది, రాములు, వెంకట్, నర్సింహులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “పేపర్ బాయ్”. ఈ చిత్రం ఆగస్ట్31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైద్రాబాద్ ధసపల్లా హోటల్లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రంలో…

సీనియర్ నటి అన్న‌పూర్ణ‌మ్మ మాట్లాడుతూ – “ప్రేమ కోసం వెయిట్ చేసి చూడాలి. రెండు కుటుంబాల‌ను క‌ష్ట‌పెట్ట‌కూడ‌దనే క‌థ‌తో చేసిన సినిమా ఇది. క‌థే హీరో. సంతోశ్ శోభ‌న్, రియా సుమ‌న్‌లు చ‌క్క‌గా న‌టిస్తే.. సంప‌త్ నంది, ఇత‌ర నిర్మాత‌లు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా సినిమాను నిర్మించారు. ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు“ అన్నారు.

డైరెక్ట‌ర్ జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ “మా సినిమా ప్రీ లుక్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. సంప‌త్‌గారు న‌న్ను, సంతోశ్‌, రియా, మ‌హేశ్ విట్టా స‌హా కొత్త‌వాళ్ల‌ను ఆయ‌న బాగా ఎంక‌రేజ్ చేశారు. ఆయ‌న స్ట్రాంగ్ పిల్ల‌ర్‌లా మా సినిమాను ముందుకు న‌డిపించారు. నాకు స‌హ‌కారం అందించిన ద‌ర్శ‌కత్వ శాఖ‌కు థాంక్స్‌. సంప‌త్‌గారి రాసిన క‌థ‌, మాట‌లను ప్రేక్ష‌కులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వండ‌ర్ ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. టీమ్ నుండి చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఇదంతా సంప‌త్‌గారి వ‌ల్లే కుదిరింది. ముర‌ళి మామిళ్ల గారి వ‌ల్లే మా టీమ్ అంతా ఇక్కడ కూర్చుంది“ అన్నారు.

నటుడు సత్తి మాట్లాడుతూ – “నేను ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. అంత కంటే ముందుగానే ఏమైంది ఈవేళ సినిమాలో సంప‌త్ అన్న.. నాకు యూస‌ప్ అనే క్యారెక్ట‌ర్ ఇచ్చాడు. గౌత‌మ్ నంద‌లో న‌న్ను చూసి మ‌ళ్లీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు. సంతోశ్ అన్న ఎప్పుడూ కృత‌జ్ఞ‌త‌తో ఉంటారు. రియాగారు కూడా కామ్‌గా ఉంటారు. డైరెక్ట‌ర్‌గారు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చి న‌టింప చేసుకున్నారు. భీమ్స్‌గారు మంచి సంగీతం ఇచ్చారు“ అన్నారు.

హీరోయిన్ రియా సుమ‌న్ మాట్లాడుతూ “పేప‌ర్ బాయ్‌ని సూప‌ర్‌హిట్ బాయ్‌ని చేసినందుకు థాంక్స్‌. సంప‌త్‌గారికి, జ‌య‌శంక‌ర్‌గారికి థాంక్స్‌. గోల్డెన్ ఆఫ‌ర్ అనుకుంటున్నాను. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్“ అన్నారు.

హీరో సంతోశ్ శోభ‌న్ మాట్లాడుతూ – “సినిమాను ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చిన సంప‌త్‌గారికి థాంక్స్‌. నిర్మాత‌గానే కాదు.. ర‌చ‌యిత‌గా కూడా ముందుండి న‌డిపించారు. స‌త్తెన్న‌, పోసాని, రియా, మ‌హేశ్‌, స‌న్ని అందరికీ థాంక్స్‌. భీమ్స్‌గారు వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. జ‌య‌శంక‌ర్‌గారు చ‌క్క‌గా తెర‌కెక్కించినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ముర‌ళిగారికి, డైరెక్ష‌న్ టీంకి థాంక్స్‌“ అన్నారు.

కథా రచయిత నిర్మాత సంప‌త్ నంది మాట్లాడుతూ – “ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా పేప‌ర్‌బాయ్ దినోత్స‌వం. కాబ‌ట్టి పేప‌ర్‌బాయ్స్ అంద‌రికీ థాంక్స్‌. చాలా మంది ఫోన్ చేసి మంచి ప్ర‌య‌త్నం చేశాన‌ని అప్రిషియేట్ చేశారు. మా సినిమాలో స్టార్స్ ఎవ‌రూ లేరు. డీసెంట్ ప్ర‌య‌త్నం చేశాం. శుక్ర‌వారం నుండి ఆదివారం వ‌ర‌కు క‌లెక్ష‌న్స్‌తో పాటు థియేట‌ర్స్ కూడా పెరిగాయి. ఈ సంద‌ర్భంగా గీతాఆర్ట్స్ అల్లు అర‌వింద్‌గారికి థాంక్స్ చెబుతున్నాను. సౌంద‌ర్‌రాజ‌న్‌గారి వ‌ల్ల‌నే సినిమా ఇంత గ్రాండ్‌గా క‌న‌ప‌డుతుంది. కానీ చాలా చిన్న ప్ర‌య‌త్న‌మిది. డైరెక్ట‌ర్ ప్రొడ్యూస్ చేస్తున్న‌ప్పుడు ఎవ‌రూ ఎంక‌రేజింగ్‌గా మాట్లాడ‌రు. నాకు అలాంటి మాట‌లే మాట్లాడారు. నేను డ‌బ్బులు సంపాదించాల‌నే ఆలోచ‌న‌ల‌తో ప్రొడ‌క్ష‌న్‌లోకి రాలేదు. ఇండ‌స్ట్రీ నాకు అవ‌కాశం ఇచ్చింది. నేను ఇండ‌స్ట్రీలో మ‌రొక‌రి అవ‌కాశం ఇస్తేనే ఇండ‌స్ట్రీ మ‌రో అవ‌కాశం ఇస్తుంద‌ని భావించే ప్రొడక్ష‌న్ చేశాను. ఈ ప్రొడ‌క్ష‌న్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా కోసం జ‌య‌శంక‌ర్‌, రియా, సంతోశ్ స‌హా ఎగ్జ‌యిట్‌మెంట్ ఉన్న ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేశారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ముర‌ళి మామిళ్ల‌, స్క్రిప్ట్ ప‌రంగా నాకు స‌పోర్ట్ చేసిన సుధాక‌ర్ పిల్ల‌ర్స్‌గా సినిమాకు మోశారు. ఈ స‌క్సెస్ క్రెడిట్‌ను మా టీంకే ఇస్తున్నాను. పెద్ద కెమెరామెన్ అయిన సౌంద‌ర్ రాజ‌న్.. క‌థ న‌చ్చి ముందుకు స‌పోర్ట్ చేశారు. సినిమా పెద్ద స్కేల్‌లో క‌న‌ప‌డుతుందంటే సౌంద‌ర్‌రాజ‌న్ ‌గారే కార‌ణం. ఆయ‌న‌కు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా త‌క్కువే. రాజీవ్‌నాయ‌ర్‌, త‌మ్మిరాజు, భీమ్స్ స‌హా అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here