`జంబ ల‌కిడి పంబ‌` లోగో విడుద‌ల చేసిన అల్ల‌రి న‌రేశ్‌

0
268

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి, జో జో జోస్‌, శ్రీనివాస్ రెడ్డి.ఎన్ ఈ సినిమాను నిర్మిస్తున్న చిత్రం `జంబ ల‌కిడి పంబ‌`. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా లోగోను అల్ల‌రి నరేశ్ ఆయ‌న స్వ‌గృహంలో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీనివాస్‌, నిర్మాత ర‌వి, ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీ కృష్ణ‌, స‌హ నిర్మాత బి.సురేశ్ రెడ్డి, జో జో జోస్‌, శ్రీనివాస్ రెడ్డి.ఎన్ సహా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత ర‌వి మాట్లాడుతూ – “ప్రేక్ష‌కుల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు. జంబ ల‌కిడి పంబ‌` సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది. శ్రీనివాస్ రెడ్డిగారు హీరోగా న‌టించిన ఈ చిత్రం లోగోను అల్ల‌రి న‌రేశ్ గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వ‌స్తుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులంద‌రికీ నచ్చుతుంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీ కృష్ణ మాట్లాడుతూ – “ఆడియెన్స్‌కు ఉగాది శుభాకాంక్ష‌లు. `జంబ ల‌కిడి పంబ‌` సినిమా క‌ల్ట్ మూవీ. ఇందులో `జంబ ల‌కిడి పంబ‌` అనే ప‌దానికి అర్థం లేదు. కానీ అదే టైటిల్‌గా పెట్టిన ఈ సినిమాతో ఈవీవీగారు కామెడీలో కొత్త కోణాన్ని చూపారు. అప్ప‌టి సినిమాకు.. ఇప్పుడు మేం చేసిన సినిమాకు సంబంధం లేదు. క‌థ‌కు సూట్ అవుతుంద‌నిపించి ఈ టైటిల్‌ను పెట్టాం. ఈవీవీగారి మ్యాజిక్‌ను మ‌ళ్లీ మా సినిమ‌మా క్రియేట్ చేస్తుంద‌ని చెప్ప‌లేను. అలాగే ఆ రేంజ్‌ని రీచ్ అవుతామ‌ని చెప్ప‌లేం. అది అసాధ్య‌మ‌ని కూడా తెలుసు. అయితే ఆ సినిమా గౌర‌వాన్ని త‌గ్గించమ‌ని చెబుతున్నాం. ప్ర‌స్తుతం సినిమా హైద‌రాబాద్ ప‌రిస‌రాల ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది“ అన్నారు.

అల్ల‌రి నరేశ్ మాట్లాడుతూ – “ఈవీవీగారి `జంబ ల‌కిడి పంబ‌` ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. నిజానికి జంబ ల‌కిడి పంబ అనే ప‌దాన్ని రేలంగిగారు క్రియేట్ చేశారు. దాన్నే నాన్న‌గారు టైటిల్‌గా పెట్టి సినిమా చేశారు. శ్రీనివాస‌రెడ్డిగారు హీరోగా చేసిన సినిమా పెద్ద హిట్ కావాలి. ఈ క‌థ నాకు తెలుసు. ఆ సినిమాకు ధీటుగా ఉంటుంద‌ని భావిస్తున్నాను. గోపీ సుంద‌ర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు, లాభాల‌ను తేవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

హీరో శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ – “మా సినిమా టైటిల్ లోగోను న‌రేశ్‌గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పించేలా ఉంది“ అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణముర‌ళి, వెన్నెల‌కిషోర్, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ర‌ఘ‌బాబు, స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రితేజ‌, హిమ‌జ‌, సుధ, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: స‌తీశ్ ముత్యాల‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌: రాజీవ్ నాయ‌ర్‌, స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, నిర్మాత‌లు: ర‌వి, జో జో జోస్‌, శ్రీనివాస్ రెడ్డి.ఎన్‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీ కృష్ణ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here