శ్రీ బాలాజీ వీడియోస్ ద్వారా 300కు పైగా తెలుగు సినిమాలను విడుదల చేసిన నిరంజన్ పన్సారి వీడియో రంగంలో సాంకేతికంగా కొత్త ఒరవడిని స ష్టించి, ప్రస్తుతం ఎల్‌ఇడి లైట్స్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. భారత దేశంలో ‘లాయల్ ఎల్‌ఇడి’ బ్రాండ్ ఎల్‌ఇడి లైట్స్ హైదరాబాద్‌లో బుధవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ‘బాహుబలి’ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్‌ఇడి ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెల్‌కాస్ట్ కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్ సి.ఇ.ఓ. మనీష్ ఆనంద్, వెల్‌కాస్ట్ కంపెనీ యు.ఎస్.ఎ., యు.కె., ఇ.యు., జి.సి.సి. ప్రాంతాల సి.ఇ.ఓ. అస్పాక్ షేక్ పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ”బాలాజీ వీడియోస్ ద్వారా నేను సంగీత దర్శకత్వం వహించిన చాలా చిత్రాలను నిరంజన్ పన్సారీ విడుదల చేశారు. నాణ్యత విషయంలో నేనందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గానీ, పాటలు గానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా వీడియో సీడీలను ఆయన అందించారు. ‘మగధీర’ చిత్రంతో తొలిసారిగా తెలుగులో బ్లూరే ఫార్మాట్‌ని పరిచయం చేసిన ఘనత బాలాజీ వీడియోస్‌కే దక్కుతుంది. ఇప్పుడు ఎల్.ఇ.డి. రంగంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీడియో రంగంలో సక్సెస్ అయినట్టుగానే ఎల్.ఇ.డి. పరిశ్రమలో మంచి నాణ్యతతో కూడిన ఉపకరణాలను అందిస్తూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
‘లాయల్ ఎల్.ఇ.డి.’ ఇండియా ప్రై. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ పన్సారీ మాట్లాడుతూ ”ఎల్.ఇ.డి. బల్బ్ గురించి ఇప్పటికే ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు. కొన్ని ప్రసిద్ధి చెందిన బ్రాండెడ్ ఎల్.ఇ.డి. బల్బులకు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల ఓరల్ వారంటీ ఇస్తున్నారు. మేమిచ్చే లాయల్ ఎల్.ఇ.డి. లైట్స్ జీవితకాలం 5 సంవత్సరాలు అయినా సర్టిఫైడ్ వారంటీ 3 సంవత్సరాలు ఇస్తాము. ఇది భారత దేశంలో ఏ ఎల్.ఇ.డి. కంపెనీ ఇవ్వలేదు” అన్నారు.
వెల్‌కాస్ట్ కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్ సి.ఇ.ఓ. మనీష్ ఆనంద్ మాట్లాడుతూ ”ప్రపంచ వ్యాప్తంగా మా కంపెనీ వెల్‌కాస్ట్ ద్వారా ఇప్పటికే కొన్ని కోట్ల ఉపకరణాల అమ్మకాలు జరిగాయి. 2012లో మా కంపెనీని ప్రారంభించాం. ఈ ఐదేళ్ళ కాలంలోనే మా కంపెనీ నాణ్యత విషయంలో ఎంతో ప్రాచుర్యం పొందింది” అన్నారు.
వెల్‌కాస్ట్ కంపెనీ యు.ఎస్.ఎ., యు.కె., ఇ.యు., జి.సి.సి. ప్రాంతాల సి.ఇ.ఓ. అస్పాక్ షేక్ మాట్లాడుతూ ”మీ నగరానికి వెల్‌కాస్ట్ కంపెనీ అందిస్తున్న లాయల్ ఎల్.ఇ.డి. లైట్స్ మినిమం 200 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ధరను నిర్ణయించడం జరిగింది. ముందుగా మేము 60 మోడల్స్‌ని ఇండియాకు ఇవ్వడానికి ఒప్పందం జరుపుకున్నాం. ఇప్పటికే దుబాయ్‌లో వున్న ప్రపంచంలోనే ఎత్తయిన భవంతి బూర్జ్ ఖలీఫాకి మా ఎల్.ఇ.డి. లైట్స్‌ను వినియోగించారు. ఇలా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన భవంతుల్లో, వీధుల్లో మా ఎల్.ఇ.డి. లైట్స్ కాంతివంతంగా వెలుగుతున్నాయి” అన్నారు.