‘గురు’ మూవీ రివ్యూ

0
154

కథ:

తన పై అధికారి దేవ్ ఖత్రి తో సరిపోక వైజాగ్ వచ్చేస్తాడు బాక్సింగ్ కోచ్ ఆదిత్య. అక్కడ అల్లరి చిల్లర గా తిరిగే రామేశ్వరి లోని ప్రతిభ ని గుర్తించిన ఆదిత్య తనని జాతీయ స్థాయి బాక్సర్ గా ఎలా తయారు చేసాడనేది ‘గురు’.

నటన :

బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్ అద్భుతంగా అభినయించారు. వెంకీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు అనొచ్చు . పాత్రలోని భిన్న పార్శ్వాలను చాలా బాగా ప్రదర్శించారు. తన పాత్రలోని కోపాన్ని, తపనని, నిస్సహాయత ని బాగా పలికించడమే కాకుండా ప్రేక్షకులు ఆ పాత్రతో కనెక్ట్ అయ్యేలా చేసారు వెంకీ.

వెంకటేష్ తర్వాత చెప్పుకోవాల్సింది బాక్సర్ గా కనిపించిన రితిక సింగ్ గురించి. స్వతహాగా బాక్సర్ అయిన రితిక పాత్రకి చక్కగా సరిపోవడమే కాకుండా చాలా సహజంగా అభినయించడం తో వెంకీ-రితిక పాత్రల మధ్య ఎమోషన్స్ బాగా పండాయి. ముంతాజ్, జాకిర్, నాజర్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

బలాలు :

వెంకటేష్
రితిక
దర్శకత్వం
బలమైన భావోద్వేగాలు

బలహీనతలు :

సాదాసీదా కథనం

విశ్లేషణ :

దర్శకురాలు సుధా కొంగర ఈ కథని ఇప్పటికి రెండు భాషల్లో తెరకెక్కించారు. తాను రాసుకున్న కథ మీద తనకి ఉన్న పట్టు స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ తెరకెక్కిస్తున్న తాను అనుకున్న భావోద్వేగాల్ని అంతే స్థాయిలో రక్తి కట్టించడమే దీనికి నిదర్శనం. మొదలైనప్పటి నుండి ఆకట్టుకునే డ్రామా నడిపిస్తూనే ఎక్కడా మోతాదు మించకుండా జాగ్రత్త పడ్డారు. కోచ్ కి, స్టూడెంట్ కి మధ్య ఉండే ఎమోషనల్ కనెక్ట్, క్రీడా శాఖలో ఉండే అవినీతి, సాటి క్రీడాకారుల్లో ఉండే అసూయ అన్నిటిని చక్కగా కలుపుతూనే భావోద్వేగాల్ని రక్తి కట్టించడం ఈ చిత్రానికి ఉన్న ప్రధాన బలం.

సంతోష్ నారాయణన్ సంగీతం, నేపధ్య సంగీతం ఆకట్టుకుంటాయి. శక్తివేల్ కెమెరా పనితనం బావుంది. మాటలు సూటిగా సహజంగా ఉన్నాయ్. ఉన్నతమైన నిర్మాణ విలువలతో మంచి క్వాలిటీ తో చిత్రాన్ని తెరకెక్కించారు.

బాటమ్-లైన్ : అలరించే స్పోర్ట్స్ డ్రామా
రేటింగ్ : 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here