టాంటెక్స్ వారి అవార్డ్ ఆఫ్ రిక‌గ్నైజేష‌న్ అందుకున్న జెమిని సురేష్‌…

0
360

ఉత్త‌ర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్‌) డ‌ల్లాస్‌లో జ‌న‌వ‌రి 28న సంక్రాంతి సంబ‌రాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ల‌క్ష్మి పాలేటి, ఉప్ప‌ల‌పాటి కృష్ణారెడ్డి, స‌మీరా ఇల్లందుల‌, మ‌ధుమ‌హిత మ‌ద్దుకూరి, అభిమ‌త మ‌ద్దుకూరి, కార్య‌వ‌ర్గ నూత‌న అధ్యక్షుడు ఉప్ప‌ల‌పాటి కృష్ణారెడ్డి, పూర్వాధ్య‌క్షులు జొన్న‌ల‌గ‌డ్డ సుబ్ర‌హ్మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్నో చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో అల‌రించిన బుల్లి తెర వ్యాఖ్యాత‌, చ‌ల‌న చిత్ర న‌టుడు జెమిని సురేష్‌ను టాంటెక్స్ క‌మిటీవారు విశిష్ట అతిథిగా స‌త్క‌రించారు. ఎన్నో అవార్డులు అందుకున్నా త‌న‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించి ఇంత ఆద‌ర‌ణ చూపించిన టాంటెక్స్‌వారిచ్చిన అవార్డ్ ఆఫ్ రిక‌గ్నైజేష‌న్‌ అవార్డును, అక్క‌డి తెలుగు ప్ర‌జులు చూపిన ఆద‌ర‌ణను మ‌ర‌చిపోలేను.. ఈ సంద‌ర్భంగా టాంటెక్స్ వారికి నా కృతజ్ఞ‌త‌లు అంటూ జెమిని సురేష్ త‌న హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here