`S -3, య‌ముడు-3` వాయిదా క‌న్ఫ‌మ్‌- తెలుగు నిర్మాత శివ‌కుమార్‌

0
39

త‌మిళ‌నాట నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు సూర్య `ఎస్‌-3`ని తీవ్రంగా దెబ్బ‌కొట్టాయి. జ‌ల్లిక‌ట్టు వివాదం అటు త‌మిళ్‌, ఇటు తెలుగు రిలీజ్‌ని అడ్డుకుంది. వాస్త‌వానికి జ‌న‌వ‌రి 26న రిలీజ్ చేస్తున్నాం అంటూ స్టూడియోగ్రీన్ సంస్థ అధికారికంగా ట్విట్ట‌ర్‌లో పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు రిలీజ్ వాయిదా ప‌డిందంటూ అఫీషియ‌ల్‌గా తెలుగు నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ ప్ర‌క‌టించారు.

సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క నాయ‌కానాయిక‌లుగా నటిస్తున్న చిత్రం `S-3` (య‌ముడు-3 తెలుగు). ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వరి 26 న విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం త‌మిళ‌నాట నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా విడుద‌ల వాయిదా వేస్తున్నామ‌ని శివ‌కుమార్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా వున్న టైంలో రిలీజ్ చేస్తామ‌ని తెలిపారు. త‌దుప‌రి రిలీజ్ తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here