హీరోగా, నిర్మాత‌గా రామ్‌చ‌ర‌ణ్ బిజీ

0
130

హీరోగా `ధృవ‌` గ్రాండ్‌ సక్సెస్‌, నిర్మాత‌గా `ఖైదీనంబ‌ర్ 150` రికార్డ్ హిట్‌.. ఈ రెండిటినీ అస్వాధిస్తున్నాడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. ఇదే ఉత్సాహంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త‌ సినిమాకి రెడీ అవుతున్నారు. సేమ్ టైమ్ మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా 151వ సినిమా నిర్మించేందుకు ప్రిపేర‌వుతున్నాడు. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాల ప‌నులు కొన‌సాగుతున్నాయి.

సుక్కూ ద‌ర్శ‌క‌త్వంలోని చిత్రంలో పూర్తిగా పల్లెటూరి కుర్రాడిగా న‌టించ‌నున్నాడు. ఈ క్యారెక్ట‌ర్‌ `గోవిందుడు అందరివాడేలే` చిత్రంలో చేసిన పాత్ర‌కు పూర్తి డిఫ‌రెంట్‌గా ఉంటుంది. గోవిందుడు..లో చ‌ర‌ణ్ పల్లెటూరికి వ‌చ్చే ఎన్నారై కుర్రాడిగా క‌నిపించాడు. తాజా చిత్రంలో పూర్తి ప‌ల్లెటూరి యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఈ క్యారెక్ట‌ర్ కోసం రామ్‌చ‌ర‌ణ్ యాస‌, భాష‌, రూపం అన్నిటినీ మార్చుకుంటున్నాడు. ప‌ల్లెటూరి యువ‌కుడి ఆహార్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమా కోసమే గెడ్డం కూడా పెంచుతున్నాడు. ఇప్ప‌టికే దేవీశ్రీ మూడు ట్యూన్స్‌ని రెడీ చేశాడు. లొకేష‌న్లు రెడీ అయిపోయాయి. 150వ సినిమా గ్రాండ్ స‌క్సెస్‌ని ఆస్వాధిస్తూనే, నాన్న‌గారితో రెండో సినిమా కోసం భారీ ఎత్తున స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం హీరోగా, నిర్మాత‌గా చ‌ర‌ణ్ ఫుల్ బిజీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here