`మెగా చిరంజీవితం 150` పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన చర‌ణ్‌

0
192

“ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నంబ‌ర్ 1 జ‌ర్న‌లిస్ట్ ఎవ‌రు? అంటే ప‌సుపులేటి రామారావు గారు. మా ఫీల్డ్‌లో కూడా అంత వ‌య‌సు వ‌చ్చిన‌ప్పుడు మేం ఏం చేయాలో ఆలోచిస్తే రామారావు గారే ఇన్‌స్పిరేష‌న్‌. ఇంత పెద్ద ఏజ్‌లోనూ ఆయన వృత్తికి నిబ‌ద్ధుడై ఇన్ స్ప‌యిర్ చేస్తుండ‌డం ఆలోచింప‌జేస్తుంది“ అన్నారు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. సీనియ‌ర్ సినీజ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు ర‌చించిన‌ `మెగా చిరంజీవితం 150` పుస్త‌కాన్నిహైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ఆఫీస్‌లో రామ్‌చ‌ర‌ణ్ లాంచ్ చేశారు. తొలికాపీని ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

రామ్‌చ‌ర‌ణ్ మ‌రిన్ని సంగ‌తులు ముచ్చ‌టిస్తూ -“చిన్న‌ప్పుడు నేను చూడ‌ని ఫోటోల్ని కూడా స‌మీక‌రించి పుస్త‌కంలో అచ్చేయించారు. ఇది నంబ‌ర్ 1 బుక్‌గా ఉంది. అంద‌రూ కొని చ‌ద‌వండి. ఆద‌రించండి. మ‌రిన్ని పుస్త‌కాలు ఈ ర‌చ‌యిత నుంచి రావాలి. నాన్న‌గారి త‌ర‌పున‌, ఫ్యామిలీ త‌ర‌పున రామారావు గారికి కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు.

పుస్త‌క ర‌చ‌యిత ప‌సుపులేటి రామారావు మాట్లాడుతూ -“విశాలాంధ్ర‌, జ్యోతిచిత్ర‌లో ప‌నిచేసినప్ప‌టినుంచి మెగాస్టార్ చిరంజీవి గారితో అనుబంధం ఉంది. జ‌ర్న‌లిస్టుగా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి త‌న‌తో ఉన్న రిలేష‌న్ ప్ర‌త్యేక‌మైన‌ది. ఆ అనుబంధంతోనే చిరంజీవిపై ప‌లు పుస్త‌కాలు ర‌చించాను. 150 సినిమాల హీరోగా ఎదిగిన మెగాస్టార్‌పై `మెగా చిరంజీవితం 150` పుస్త‌కం తేవాలనుకున్న‌ప్పుడు అంద‌రినుంచి త‌గిన స‌పోర్టు ల‌భించింది“ అన్నారు సీనియ‌ర్ సినీజ‌ర్న‌లిస్ట్, పుస్త‌క‌ర‌చ‌యిత ప‌సుపులేటి రామారావు. కార్య‌క్ర‌మంలో అల్లు అర‌వింద్‌, వి.వి.నాయ‌క్, సి.క‌ల్యాణ్‌, స‌త్య‌నారాయ‌ణ, `సంతోషం` అధినేత సురేష్ కొండేటి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here