రీమేక్‌లో హీరోగా మినిష్ట‌ర్ త‌న‌యుడు…..

0
495

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖామాత్యులు గంటా శ్రీనివాస‌రావు త‌న‌యుడు గంటా రవి తేజ హీరోగా  ‘కాళహస్తి’  అనే సినిమా స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక మునుపే మ‌రో సినిమాలో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త‌మిళంలో పిజ్జా ఫేమ్ విజ‌య్‌సేతుప‌తి న‌టించిన సేతుప‌తి అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. పోలీస్ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమా త‌మిళంలో మంచి స‌క్సెస్‌ను సాధించింది. ఈ సినిమాను త‌మిళంలో తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ అరుణ్‌కుమార్, తెలుగులో కూడా డైరెక్ట్ చేసే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార‌క స‌మాచారం వెలువ‌డ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here