ట్ర‌యినింగ్ తీసుకుంటున్న పూరి త‌న‌యుడు….

0
476

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌నయుడు ఆకాష్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయ‌డానికి అన్ని విధాలుగా సిద్ధ‌మ‌వుతున్నాడు. బాల‌న‌టుడిగా ఎన్నో చిత్రాల్లో న‌టించిన ఆకాష్ పూరి పూర్తి స్థాయి హీరో కానున్నాడు. ఇదే విష‌యాన్ని పూరి జ‌గ‌న్నాథ్‌ను అడిగితే అందుకు స‌మ‌యం ఉంద‌ని, ఆకాష్‌ను ట్ర‌యినింగ్‌కు పంపుతున్నాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ఆకాష్ థాయ్‌లాండ్‌లో 45రోజుల మువై థాయ్ అనే స్పోర్ట్ కోర్సును నేర్చుకుంటున్నాడు. స్పెష‌ల్ డైట్‌ను తీసుకుంటున్నాడ‌ట‌. ట్ర‌యినింగ్ తీసుకున్న త‌ర్వాత ఆకాష్ ఎనిమిది కిలోలు బ‌రువు త‌గ్గాడు. ఈ శిక్ష‌ణ పూర్త‌యిన త‌ర్వాత జూలై నుండి న్యూయార్క్ ఆకాడ‌మీలో రెండేళ్ల కోర్సులో జాయిన్ అవుతాడ‌ట ఆకాష్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here