నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. హై టెక్నాలజీతో రూపొందిన ఈ సినిమా జనవరి 5న సెన్సార్ ఫూర్తి చేసుకుని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. కానీ నిన్న సాయంత్రం, మాత్రం సినిమా జనవరి 11న విడుదల కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలకు క్రిష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సినిమా జనవరి 12నే రాబోతున్నట్లు చెప్పేశాడు. ఇద్దరూ లెజెండ్స్ మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ఈ సంక్రాంతికి వస్తున్నారు. కాబట్టి వీరి సినిమాలపై రూమర్స్‌ను ఆపండంటూ చెప్పేశాడు.