త్రిష ప్రధాన పాత్రలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. రీతున్ సాగర్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు `1818` అనే టైటిల్ వినపడుతుంది. 2008, నవంబర్ 26న జరిగిన ముంబై ఎటాక్స్ బేస్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. సుమన్, రాజేంద్రప్రసాద్ సహా పలువురు నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇటీవల త్రిష ప్రధాన పాత్రలో గోవి డైరెక్ట్ చేసిన నాయకి కూడా తెలుగు, తమిళంలో సమాంతరంగా రూపొంది విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి డిఫరెంట్ టైటిల్‌తో రూపొందుతున్న `1818` త్రిషకు ఎలాంటి సక్సెస్ నిస్తుందో చూడాలి.