నందు” కన్నుల్లో నీరూపమే” రిలీజ్ కి రెడీ

0
940

టాలెంటెడ్ యంగ్ హీరో నందు తదుపరి సినిమా కన్నుల్లో నీరూపమే రిలీజ్ కి సిద్ధమైంది. ఫొటో, 100%లవ్, ఆటోనగర్ సూర్య, 365 డేస్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు ఇప్పుడు ఈ హార్ట్ టచ్చింగ్, లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్త్ తో వస్తున్నాడు. ఇప్పటివరకు విభన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన నందు ఈసారి కాస్త రూటు మార్చి కొంచెం కామెడీ టచ్ ఉన్న రోల్ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏ.ఎస్.పి. క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ బాసాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కన్నడ భామ తేజస్వి ప్రకాష్  హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నందు కెరిర్ లోనే భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన  మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here