‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ – రివ్యూ

0
168
టైటిల్‌: ఇంట్లో దెయ్యం నాకేం భయం 
సెన్సార్‌: యు/ఎ 
రన్‌ టైమ్‌: 2 గం||15నిమి|| 
విడుదల తేది: 30-12-2016 
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి 
నటీనటులు: అల్లరి నరేష్‌, రాజేంద్ర ప్రసాద్‌, కృతిక, మౌర్యాని తదితరులు 
సంగీతం: సాయికార్తీక్‌ 
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర 
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ 
రచన, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి 
కథ: 
నరేష్‌(అల్లరి నరేష్‌)కు ఓ అనాథ పిల్లను కాపాడటం కోసం డబ్బు అవసరం అవుతుంది. అందుకని గోపాలం(రాజేంద్రప్రసాద్‌) కొన్న కొత్త ఇంట్లో ఉన్న దెయ్యాన్ని వెళ్లగొట్టడానికి మాంత్రికుడుగా వెళతాడు. అయితే ఆ ఇంట్లోని దెయ్యానికి, నరేష్‌కు ఓ సంబంధంఉంటుంది. ఇంతకు ఆ రిలేషన్‌ ఏంటి? నరేష్‌ ఇంట్లో నుండి దెయ్యాన్ని వెళ్లగొట్టాడా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….
పెర్‌ఫార్మెన్స్‌: 
అల్లరి నరేష్‌ అంతా తానై సినిమాను ముందుకు నడపడంలో సక్సెస్‌ అయ్యాడు. ఒక పక్క కామెడితో ఆడియెన్స్‌ను నవ్విస్తూనే, సెంటిమెంట్‌ను కూడా పండించాడు. కృతిక తన పాత్రకు న్యాయం చేసింది. కీలక పాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్‌ ప్రేక్షకుల్ని తనదైన కామెడితో ఆకట్టుకున్నారు. మౌర్యాని కూడా చక్కగా నటించింది. షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, జయప్రకాష్‌ రెడ్డి, ప్రభాస్‌ శ్రీను, బాహుబలి ప్రభాకర్‌ తదితరులు వారి వారి పాత్రల్లో పరిధి మేర నటించి మెప్పించారు.
పాజిటివ్‌: 
కామెడి
నటీనట వర్గం
ఇంటర్వెల్‌ బ్లాక్‌
నెగటివ్స్‌: 
ఊహాజనితమైన కథ
విశ్లేషణ: 
మెయిన్‌ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని దకామెడిని మిక్స్‌ చేసి సినిమాను తెరకెక్కించడంలో ర్శకుడు జి.నాగేశ్వరరెడ్డికి ఓ ప్రత్యేకమైన శైళి ఉంది. ఈ విషయాన్ని ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ చిత్రంతో మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు. అసలు కథ సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తెలిసిపోతుంది. ముఖ్యంగా కామెడి సీన్స్‌ ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తాయి. ఫస్టాఫ్‌ బావుంది. క్లైమాక్స్‌ కూడా ఆకట్టుకుంటుంది. సాయికార్తీక్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ డీసెంట్‌గా ఉంది. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎడిటింగ్‌ ఇంకాస్తా బావుండాలనిపించింది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ రిచ్‌గా ఉన్నాయి.
బోటమ్‌ లైన్‌ : ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’….ఆకట్టుకునే హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ 
రేటింగ్‌ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here