‘అప్పట్లో ఒకడుండేవాడు’ – రివ్యూ

0
165

టైటిల్‌: అప్పట్లో ఒకడుండేవాడు

టైటిల్‌: అప్పట్లో ఒకడుండేవాడు 
సెన్సార్‌: యు/ఎ 
రన్‌ టైం: 2గం||5నిమి|| 
రిలీజ్‌ డేట్‌: 30-12-2016 
బ్యానర్‌: ఆరన్‌ మీడియా వర్క్స్‌ 
నటీనటులు: నారా రోహిత్‌, శ్రీ విష్ణు, తాన్యా హోప్‌, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, జి.వి., రాజీవ్‌ కనకాల తదితరులు 
సంగీతం: సాయికార్తీక్‌ 
సినిమాటోగ్రఫీ: నవీన్‌ యాదవ్‌ 
నిర్మాత: ప్రశాంతి, కృష్ణ విజయ్‌ 
రచన, దర్శకత్వం: సాగర్‌ కె.చంద్ర 
క‌థః 
1992లో హైద‌రాబాద్ రంజీలో ఆడాల‌నుకునే యువ‌కుడు రైల్వే రాజు క్రికెట్ లోకంగా బ‌తుకుతుంటాడు. రంజీలో సెల‌క్ట్ అయితే త‌ను ప్రేమించిన అమ్మాయి నిత్య‌(తాన్యా హోప్‌)ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. కానీ అదే స‌య‌మంలో న‌క్స‌లిజంను రూపుమాపాల‌ని ప్ర‌య‌త్నించే సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఇంతియాజ్ అలీ(నారా రోహిత్‌), న‌క్స‌లైట్స్‌తో సంబంధాలున్నాయని రాజును అరెస్ట్ చేస్తాడు. ఎలాగో బ‌య‌ట‌ప‌డ్డ రాజు, లోక‌ల్‌గా జ‌రిగిన గొడ‌వ‌లో లోక‌ల్ దాదాభ‌గ‌వాన్ దాస్‌(సుధాక‌ర్ నాయుడు)ని అనుకోకుండా కొట్ట‌డం, అత‌ను చ‌నిపోవ‌డం జ‌రుగుతాయి. అప్పుడు ఇంతియాజ్ అలీ రాజును అరెస్ట్ చేస్తాడు. అప్పుడే అశోక్ రెడ్డి అనే బిజినెస్ మేన్ రాజుకు స‌పోర్ట్ చేస్తాడు. అయితే ఇంతియాజ్ అలీ కార‌ణంగా రాజు త‌ల్లి, అక్క చ‌నిపోవ‌డంతో ఇంతియాజ్‌పై రాజు క‌క్ష క‌ట్టి, ఉద్యోగాన్ని పీకేయిస్తాడు. అశోక్ రెడ్డి ప‌రిచ‌యంతో రైల్వే రాజు జీవితం అనుకోని మ‌లుపు తిరుగుతుంది. అదేంటి?  రైల్వే రాజు, ఇంతియాజ్ జీవితాలు ఏమ‌వుతాయి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….
పెర్‌పార్మెన్స్‌: 
నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌ ఇంతియాజ్‌ అలీ పాత్రలో నారా రోహిత్‌ నటన సూపర్బ్‌. ఒక పక్క నిజాయితీతో పాటు ఈగో ఉన్న పాత్రలో నారా రోహిత్‌ చక్కని వేరియేషన్‌ చూపించాడు. శ్రీవిష్ణు పాత్ర సరికొత్తగా ఉంది. ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలో శ్రీవిష్ణు బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. తాన్యా హోప్‌ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. బ్రహ్మాజీ, అజయ్‌, ప్రభాస్‌ శ్రీను, రాజీవ్‌ కనకాల సహా మిగిలిన అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
పాజిటివ్‌: 
కథ
స్క్రీన్‌ప్లే
నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు
నెగటివ్‌:
సెకండాఫ్‌ లెంగ్త్‌ ఎక్కువగా ఉండట
విశ్లేషణ: 
దర్శకుడు సాగర్‌ కె.చంద్ర ఎంపిక చేసుకున్న బ్యాక్‌డ్రాప్‌, దాన్ని కథను ఆధారంగా చేసుకుని సినిమాను నడిపిన తీరు ఆసక్తికరంగా ఉంది. ప్రతి సన్నివేశాన్ని, ప్రస్తుతం ఉన్న సీన్స్‌కు లింక్‌ పెడుతూ సినిమాను గ్రిప్పింగ్‌గా నడిపించాడు దర్శకుడు సాగర్‌ కె.చంద్ర. ఇంటర్వెల్‌ బ్లాక్‌ బావుంది. బ్రహ్మాజీ తనదైన టైమింగ్‌తో కూడిన యాక్టింగ్‌తో మెప్పించాడు. సాయికార్తీక్‌ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ డీసెంట్‌గా ఉన్నాయి. నవీన్‌ యాదవ్‌ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సంభాషణలు సినిమాలో కీలకమైయ్యాయి.
బోటమ్‌ లైన్‌ : ‘అప్పట్లో ఒకడుండేవాడు’…….గ్రిప్పింగ్‌ క్రైమ్‌ డ్రామా 
రేటింగ్‌ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here