“రామ బాణం” పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ మంచు మోహన్ బాబు

0
324

ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు రచించిన రామ బాణం పుస్తకాన్ని ఈరోజు టెంపుల్ చైర్మన్ మోహన్ బాబు  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు  మాట్లాడుతూ.. కరోనా వల్ల నేను టెంపుల్ కు వచ్చి చాలా రోజులు అయినది. ఈ కరోనా పూర్తిగా పోయి అందరూ ఆరోగ్యంగా వుండాలని భగవంతుడిని కోరు కుంటున్నాను. పూజారి రాంబాబు గారు రచించిన రామ బాణం పుస్తకము చాల బాగుంది. ఈ పుస్తకం మంచి ప్రజాధారణ పొందాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు మాట్లాడుతూ.. మోహన్ బాబు గారు ఈ పుస్తకం ఆవిష్కరించటం చాల సంతోషం. ఈ పుస్తకం లో ముందు మాట చాల చక్కగా రాసారు. రామ బాణం పుస్తకం అందరు చదవాలని కోరుకుంటున్నా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here