మహేష్ బాబు ట్విట్టర్ ఎంట్రీ కి పదేళ్లు……!!

0
1200
మహేష్ సందేశం

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో వరుసగా కెరీర్ పరంగా మూడవ విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ నమోదు చేసారు. ఇక ఇటీవల కరోనా ఎఫెక్ట్ వలన సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి గడుపుతున్నారు సూపర్ స్టార్.

ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ, తన సినిమా మరియు వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలు ఫ్యాన్స్ తో పంచుకునే సూపర్ స్టార్, ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చి నేటితో సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకున్నారు. మీ అందరితో ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ఇకపై హాయిగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు దొరికింది అంటూ మహేష్ తొలి ట్వీట్ చేసారు. ఇక ప్రస్తుతం మహేష్ ట్విట్టర్ అకౌంట్ లో మొత్తం 9.2 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. నేటితో సూపర్ స్టార్ ట్విట్టర్లో పదేళ్లు పూర్తి చేసుకొవడంతో పలువురు ఫ్యాన్స్ ఆయనకు అభినందనలు తెలియచేస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here