ఫిబ్రవరి 28న ‘కనులు కనులను దోచాయంటే’

0
844

‘కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దాని అర్థం’ – మణిరత్నం దర్శకత్వం వహించిన ‘దొంగ దొంగ’లో హిట్‌ సాంగ్‌ ఇది! ఇప్పుడీ పాటలోని తొలి మూడు పదాలే టైటిల్‌గా ఒక సినిమా ముస్తాబవుతోంది. మణిరత్నం ‘ఓకే బంగారం’, నాగ అశ్విన్‌ ‘మహానటి’తో మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్‌ సల్మాన్‌ అందులో హీరో. హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌.

దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలవుతోంది. దేసింగ్‌ పెరియసామి దర్శకుడు. నిర్మాణ సంస్థలు వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానుంది. కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్ తెలుగు హక్కులను దక్కించుకుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన 25వ చిత్రమిది. తెలుగులో శనివారం ‘గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే’ పాటను విడుదల చేశారు. మసాలా కాఫీ సంగీతం అందించిన ఈ బాణీకి సామ్రాట్‌ నాయుడు, పూర్ణాచారి సాహిత్యం అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు దేసింగ్‌ పెరియసామి మాట్లాడుతూ ‘‘మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్‌ సిద్ధార్థ్‌ క్యారెక్టర్‌లో దుల్కర్‌ సల్మాన్‌ నటించారు. అతడికి కల్లీస్‌ అని స్నేహితుడు ఉంటాడు. మీరా పాత్రలో హీరోయిన్‌ రీతూ వర్మ నటించారు. ఆమెకు శ్రేయ అని స్నేహితురాలు ఉంటుంది. మీరాతో సిద్ధార్థ్‌, శ్రేయతో కల్లీస్‌ ప్రేమలో పడతారు. లగ్జరీ లైఫ్‌ స్టైల్‌కు అలవాటు పడిన సిద్ధార్థ్‌, కల్లీస్‌ ఏం చేశారు? వాళ్లు చేసిన పనుల వల్ల ఎటువంటి సమస్యల్లో చిక్కుకున్నారు? అనేది చిత్రకథ. మలుపులతో ఆసక్తికరంగా ఉంటుంది’’ అని అన్నారు.

ఈనెల 28న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది.

ఇతర తారాగణం:
రక్షణ్, నిరంజని అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు

సాంకేతిక విభాగం:

డైరెక్టర్: దేసింగ్ పెరియసామి
ప్రొడ్యూసర్: వయాకామ్18 స్టూడియోస్ & ఆంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ
సినిమాటోగ్రాఫర్ . కె.ఎం. భాస్కరన్
మ్యూజిక్: మసాలా కాఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోనీ
ఆర్ట్ : ఆర్.కె. ఉమాశంకర్
కాస్ట్యూమ్ డిజైనర్: నిరంజని అహతియాన్
స్టంట్: సుప్రీమ్ సుందర్
స్టిల్స్: ఎం.ఎస్. ఆనంద్
కోరియోగ్రఫీ: ఎం. షెరీఫ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నిరూప్ పింటో
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మోహన్ గణేశన్
ప్రొడక్షన్ కంట్రోలర్: ఎస్. వినోద్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here