నా 25 సినిమాల కెరీర్‌లో ఈరోజు పొందిన ఆనందాన్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను..మ‌హ‌ర్షి చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ – సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌

0
438

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదలై మహేష్ గత చిత్రాల రికార్డులని తిరగ రాసే దిశగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ మహేష్ కెరీర్లోనే ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం `మ‌హ‌ర్షి` యూనిట్ సుద‌ర్శ‌న్ 35 థియేట‌ర్‌ను సంద‌ర్శించింది. ఈ కార్య‌క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, అల్ల‌రి న‌రేష్‌, పూజా హెగ్డే త‌దిత‌రులు పాల్గొన్నారు. తమ అభిమాన హీరోని చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో హాజయ్యారు. సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ ప్రాంగణం మొత్తం మహేషబాబు అభిమానులతో కిక్కిరిసింది.

తన అభిమానుల జయ జయ ధ్వానాలు మధ్య సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మాట్లాడుతూ – “సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌కు వ‌చ్చి చాలా ఏళ్ల‌య్యింది. ఆరోజుల‌ను నేను మ‌రచిపోలేను. మురారి సినిమాను ఇదే థియేట‌ర్‌లో నేను చూసిన‌ప్పుడు నాన్న‌గారు నా భుజంపై చెయ్యి వేశారు. ఆరోజును నేను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. అంద‌రికీ తెలిసిందే. ఎ.ఎం.బి.సినిమాస్‌లో నేను పార్ట్‌న‌ర్ అయ్యి మ‌ల్టీప్లెక్స్ ఓపెన్ చేశాం. ఆ థియేట‌ర్ ఉన్నా.. ఈ సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌నే నా స్వంత థియేట‌ర్‌గా భావిస్తాను. ఎందుకంటే నా కెరీర్ అలాంటి సినిమాలు ఇక్క‌డ రిలీజ్ అయ్యాయి. నా 25వ సినిమా మ‌హ‌ర్షి కూడా ఇక్క‌డ రిలీజ్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఇంకా ఆనందంగాఉంది. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ థియేట‌ర్‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. మీ ఆశీస్సులు, అభిమానం ఇలాగే నాపై ఉండాలి. నా 25 సినిమాల కెరీర్‌లో ఈరోజు పొందిన ఆనందాన్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. మీ అంద‌రి కోసం మ‌రోసారి కాల‌ర్ ఎగ‌రేస్తున్నాను“ అన్నారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో మాకు మ‌హేష్‌గారితో ప‌రిచయం మురారి సినిమాకు జ‌రిగింది. ఇప్పుడు ఆయ‌న సిల్వ‌ర్ జూబ్లీ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. మ‌హేష్‌గారి సిల్వ‌ర్ జూబ్లీ మూవీ, సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో సిల్వ‌ర్ జూబ్లీ జ‌రుపుకోవాలి. మ‌హేష్‌గారికి ఇది చాలా స్పెష‌ల్ ఫిలిం. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` త‌ర్వాత మ‌ళ్లీ మ‌హర్షి చేశాం. అలాగే మ‌హేష్‌గారి కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాసర్ ఇది. ఫ‌స్ట్ వీక్‌లోనే కొట్టేస్తున్నాం. ఈ నెల 18న ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌ను విజ‌య‌వాడ‌లో గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తున్నాం“ అన్నారు.

సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ -“మ‌హేష్‌గారి సినిమాలు చూడ‌టానికి నేను 9 గంట‌ల‌కు బ‌య‌ట నిలుచునే వాడిని. టికెట్స్ కోసం దెబ్బ‌లు కూడా తిన్నాను. మీ అంద‌రిలో నేను కూడా ఒక్క‌డినే. మురారి ఆఫీస్‌లో టికెట్స్ కోసం రాజుగారి ఆఫీస్‌లో రెండు గంట‌లు వెయిట్ చేశాను. ఆయ‌న ఒక్క‌డు సినిమాను ఆయ‌న ముందు వ‌రుస‌లో కూర్చుంటే నేను వెనుక వ‌రుస‌లో కూర్చుని ఓ ఫ్యాన్‌లాగా చూశాను. ఈరోజు ఆయ‌న 25వ సినిమాను నేను డైరెక్ట్ చేయ‌డం మ‌ర‌చిపోలేను. మ‌హేష్‌గారి కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇంత పెద్ద స‌క్సెస్ ఇచ్చినందుకు థాంక్యూ సో మ‌చ్‌. ఈ సినిమాను మీరు తీసుకున్న విధానానికి, మోసిన విధానానికి థాంక్స్‌. మ‌ళ్లీ 18న విజ‌య‌వాడ సిద్ధార్థ్ కాలేజ్‌లో మిమ్మ‌ల్ని స‌క్సెస్‌మీట్‌లో క‌లుస్తాం“ అన్నారు.

అల్ల‌రి న‌రేష్ మాట్లాడుతూ – “మ‌హేష్‌బాబుగారి అడ్డా ఇది. సుద‌ర్శ‌న్‌లో ఆయ‌న సినిమాల‌ను ఎన్నో చూశాం. ఈరోజు 25వ చిత్రంలో ఆయ‌న‌తో పాటు యాక్ట్ చేసే అవ‌కాశం ఇచ్చినందుకు మ‌హేష్‌గారికి, వంశీపైడిప‌ల్లిగారికి, మా నిర్మాత‌లు ద‌త్తుగారు, దిల్‌రాజుగారు, పివిపిగారికి థాంక్స్‌“ అన్నారు.

పూజా హెగ్డే మాట్లాడుతూ – “మ‌హ‌ర్షి సినిమాను సూప‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here