`మౌన‌మే ఇష్టం` టీజ‌ర్ విడుద‌ల‌

0
291

రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్ జంట‌గా ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ కోరాల‌త్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మౌన‌మే ఇష్టం`. ఈ చిత్ర టీజ‌ర్ ను ప్ర‌ముఖ నిర్మాత శ్యాం ప్ర‌సాద్ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ “ట్రైల‌ర్ చాలా రిచ్‌గా వుంది. కెమెరామెన్ చ‌క్క‌టి ప‌నిత‌నాన్ని చూపించారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు. ద‌ర్శ‌కుడు అశోక్ కుమార్ కోరాల‌త్ మాట్లాడుతూ “ల‌వ్ ఎక్స్‌ప్రెష్ చేయ‌డానికి ఒక జంట మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ చిత్ర‌క‌థ‌…. సినిమా పోయెటిక్ వేలో వుంటుంది. సినిమా విజువ‌ల్స్ ఇప్ప‌టి యువ‌త‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయి“ అన్నారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ “ద‌ర్శ‌కుడు అశోక్ గారు చిత్రాన్ని అద్బుతంగా తెర‌కెక్కించారు. ప్ర‌తి ఫ్రేము ఆయ‌న ఆర్ట్ వ‌ర్క్ లాగే పెయింటింగ్ లా వుంటుంది. ఈ సినిమాకు సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్శ‌ణ‌గా నిలుస్తుంది. నాజ‌ర్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సినిమా మొద‌ట్నుంచి ఒక కావ్యాన్ని చ‌దువుతున్న‌ట్టు వుంటుంది. ఈ చిత్రంలో న‌టించ‌డం అద్రుష్టంగా భావిస్తున్నాను“ అన్నారు.

ఈ చిత్రానికి క‌థః సురేష్ గ‌డిప‌ర్తి, సంగీతంః వివేక్ మ‌హాదేవ్‌, కెమెరాః జె.డి. రామ తుల‌సి, నిర్మాతః ఆశా అశోక్, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః అశోక్ కుమార్ కోర‌ల‌త్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here