నా కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఎన్టీఆర్‌, కమల్‌హాసన్‌ లాంటి లెజెండరీ హీరోలతో కలిసి నటించిన జయప్రదగారితో నటించడం నిజంగా అదృష్టం – హీరో ఇంద్ర

0
439

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ ఎస్‌.టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌. లక్ష్మినిర్మించిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ”సువర్ణసుందరి”. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్‌తో దర్శకుడు సూర్యఎమ్‌.ఎస్‌.ఎన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 2వ వారంలో ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తన మొదటి సినిమా వంగవీటితో మంచిపేరు తెచ్చుకున్న నటుడు ఇంద్రతో ఇంటర్వ్యూ.

మీ గురించి?
– నేను పుట్టింది పెరిగింది విజయవాడ, అక్కడే బిటెక్‌ పూర్తిచేశాను. తరువాత సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో మా కజిన్‌ ‘రామదూత క్రియేషన్స్‌’ అధినేత దాసరి కిరణ్‌ గారిని కలిసి ఆయన బ్యానర్‌లో పనిచేస్తున్న టైం లోనే నాకు మొదటిసారి సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

‘వంగవీటి’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
– రామ్‌ గోపాల్‌ వర్మ గారు ‘వంగవీటి’ సినిమా తీస్తున్న సమయంలో ఎలాగైనా ఆ సినిమాలో నటించాలని నా గురించి ఏమి చెప్పకుండా ఒక క్యారెక్టర్‌ కోసం నా ఫొటోస్‌ పంపడం జరిగింది. ఆర్‌జివి గారు ఆ ఫొటోస్‌ చూసి నాకు ఫోన్‌ చేసి వీడియో బైట్‌ పంపామన్నారు. తరువాత నాలుక్స్‌ని పూర్తిగా మార్చి ‘వంగవీట’ి సినిమాకోసం నన్ను తీసుకోవడం జరిగింది.

ఈ సినిమాలో అవకాశం గురించి?
– ‘వంగవీటి’ సినిమా షూటింగ్‌ సమయంలోనే దర్శకుడు సూర్య నాకు ఫోన్‌ చేసి ఒక సారి కలవమని చెప్పారు. నేను వెళ్లి కలిసినప్పుడు ఈ సినిమా స్టోరీ, నా క్యారెక్టర్‌ గురించి చెప్పడం జరిగింది. నాకు చాలా ఎక్సయిట్‌గా అనిపించి వెంటనే ఒప్పుకోవడం జరిగింది. నాపైన నమ్మకం ఉంచి నాకు అంత మంచి పాత్రను ఇచ్చినందుకు ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను.

‘సువర్ణ సుందరి’ సోషియో ఫాంటసీ సినిమా?
– అవునండి. ఇది శ్రీ క ష్ణ దేవరాయలు కాలం నాటి ఒక విగ్రహం ఆధారంగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ. అయితే ఈ సినిమా స్క్రీన్‌ప్లే ప్రజంట్‌తో పాటు పీరియాడికల్‌ బ్యాక్‌ గ్రౌండ్లో కూడా నడుస్తుంది.

మీ క్యారెక్టర్‌?
ఈ సినిమాలో నాది ఫన్‌ తోకూడుకున్న రొమాంటిక్‌ క్యారెక్టర్‌. ప్రజంట్‌ ట్రెండ్‌కు తగ్గట్లుగా సాక్షి చౌదరితో నడిచే లీడ్‌ క్యారెక్టర్‌. ఈ సినిమాలో నా పాత్రకు మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుంది.

జయప్రద, సాయికుమార్‌ లాంటి సీనియర్స్‌తో కలిసి నటించడం ఎలా అనిపిస్తుంది?
– చాలా హ్యాపీ. నా కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఎన్టీఆర్‌, కమల్‌హాసన్‌ లాంటి లెజెండరీ హీరోలతో కలిసి నటించిన జయప్రదగారితో నటించే అవకాశం వచ్చింది. సాయి కుమార్‌ గారు మంచి నటులు, ఆయన డైలాగ్‌ డెలివరీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నటించిన పూర్ణ, సాక్షి చౌదరి నటన పరంగా నాకెంతో హెల్ప్‌ చేశారు. ఇంత మంది సీనియర్‌ ఆర్టిస్టులు ఉన్న సినిమాలో నటించడం నిజంగా అద ష్టంగా భావిస్తున్నాను.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ గురించి?
– సాయికార్తీక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాలోనాలుగు పాటలు ఉన్నాయి. ప్రతీ పాట చాలా బాగుంది. ముఖ్యంగా నాకుసాకి కి మధ్య వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్‌ అవుతుంది. సాయికార్తీక్‌ బ్యాక్‌గ్రౌండ్‌మ్యూజిక్‌ కూడా అదరగొట్టాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా చక్కగా కుదిరింది.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
– 2019 నాకు చాలా లక్కీ ఇయర్‌ అని చెప్పాలి. ఈ సంవత్సరం నేను రెండు సినిమాలకు రిలీజ్‌ కాబోతున్నాయి. ‘రామచక్కని సీత ‘సినిమాలో ఒక లీడ్‌ రోల్‌ చేస్తున్నాను. అలాగే ఓంకార్‌ దగ్గర పనిచేసిన శ్రీహర్ష మందా దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. అంటూ ఇంటర్య్వూ ముగించారు నటుడు ఇంద్ర.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here