సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదుగా విడుదలైన ‘ఊరంతా అనుకుంటున్నారు’ టీజర్

0
475

న‌వీన్ విజ‌య్‌కృష్ణ‌, శ్రీనివాస్ అవ‌స‌రాల హీరోలుగా, మేఘా చౌద‌రి, సోఫియా సింగ్ హీరోయిన్లుగా, బాలాజి సాన‌ల దర్శకత్వంలో శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, ర‌మ్య గోగుల‌, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మాత‌లుగా రూపొందుతున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’ . ఈ సినిమా టైటిల్ లోగోను సూప‌ర్ స్టార్ కృష్ణ‌, ఫ‌స్ట్ లుక్‌ను విజ‌య‌నిర్మ‌ల‌, హీరో ఫ‌స్ట్ లుక్‌ను న‌రేష్‌, న‌వీన్ లుక్ టీజ‌ర్‌ను కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా…

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ “ముఖ్యంగా టైటిల్ బావుంటే సగం సినిమా స‌క్సెస్ అయిన‌ట్టే. `ఊరంతా అనుకుంటున్నారు` అనే టైటిల్ చాలా బాగుంది. ఇంగ్లిష్ ప‌దాల‌తో ఎక్కువ టైటిల్స్ వ‌స్తున్న ఈ సమ‌యంలో నేటివ్ టైటిల్ పెట్టినందుకు దర్సకనిర్మాతలని అభినందిస్తున్నాను. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా అట్మాస్పియ‌ర్‌లో పెరిగాడు న‌వీన్‌. త‌న‌లో ఈజ్ ఉంది. పాట‌లు, ఫైట్లు అన్నీ బాగా చేయ‌గలిగే కెపాసిటీ ఉంది. ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుంటాడు. ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారని నా నమ్మకం. న‌రేష్ జ‌డ్జిమెంట్ బావుంటుంది. న‌రేష్ క‌థ విన్నాన‌ని.. బావుంద‌ని చెబుతున్నాడంటే ఆ కథ 100 % బాగుంటుందని నేను నమ్ముతాను. ఈ సినిమా విజయవంతమై న‌వీన్‌కి ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలని, వస్తుందనే నమ్మకంతో నవీన్ ని ఆశీర్వదిస్తున్నాను“ అని అన్నారు.

విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ “ ఈ రోజు నవీన్ బాబు పుట్టినరోజు సందర్భంగా కృష్ణ గారు టీజర్ లాంచ్ చేస్తున్నారు. మంచి సినిమా తీసిన నిర్మాత‌ను , దర్శకుడిని అభినందిస్తున్నాను“ అని అన్నారు.

కె.ఎం.రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ “ ఒక మంచి సినిమాతో మళ్ళి మీ ముందుకు రాబోతున్నాను. న‌వీన్ క్యారక్టర్ చాలా బావుంటుంది. మంచి క‌థాబ‌లం ఉన్న సినిమా. ఈ రోజు నవీన్ పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ గారు, విజయనిర్మల గారి ఆశీర్వాదం తో ఇది ఒక మంచి సినిమా అవబోతోంది. గ్రామీణ నేప‌థ్యంతో సాగే ఆహ్లాదకరమైన సినిమా ఇది. మంచి పాటలు చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి కృతజ్ఞతలు “ అన్నారు.

న‌వీన్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ చేయడం నాకు మంచి ఎక్స్పీరియన్స్. నేను ఎక్కువగా విలేజెస్ కి వెళ్ళింది లేదు. ఈ సినిమా కోసం పాల‌కొల్లులో షూటింగ్ చేశాం. అక్క‌డే సెటిల్ కావాల‌నిపించింది. చాలా మంచి సినిమా అవుతుంది“ అని అన్నారు.

న‌రేష్ మాట్లాడుతూ “నందిని న‌ర్సింగ్ హోమ్‌తో న‌వీన్ హీరోగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగా నిలదొక్కుకుంటూనే , ఆర్టిస్ట్ గా ఎదగాలనేది నవీన్ కోరిక. ఆ సినిమా త‌ర్వాత 5,6 స్క్రిప్ట్ లు విన్నాడు. ఫైనల్ గా ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే ఈ కథ మాకు బాగా న‌చ్చింది. నేను బావున్నాయ‌న్న సినిమాలు 99 శాతం ఫెయిల్ కాలేదు. ప్రస్తుత ట్రెండ్ కి అనుగుణంగా క్లాస్, మాస్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. చక్కని టైటిల్ కుదిరింది. మిగిలిన తారాగ‌ణం కూడా చాలా బావుంది. టీజర్ చూసి థ్రిల్ అయ్యాను. చాలా డిఫరెంట్ గా ఉంది. నిర్మాత‌లు ఎక్కడా చొంప్రొమిసె అవకుండా నిర్మించారు. డ‌బ్బింగ్ జ‌రుగుతోంది. రిలీజ్ కి సిద్ధమవుతోంది. “ అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ “గ్రామీణనేప‌థ్యంలో ఉదాత్తమైన కథా చిత్రంగా రూపొందించాం. ఊరంతా అనుకుంటున్నారు టైటిల్ కి మంచి అప్లాజ్ వచ్చింది. క్యూట్ విలేజ్ బోయ్‌గా న‌వీన్ మెప్పిస్తాడు. న‌వీన్‌లోని ప‌లు షేడ్స్ ఈ సినిమాలో ఆవిష్కృత‌మ‌వుతాయి“ అని అన్నారు.

జ‌య‌సుధ‌, కోట శ్రీనివాస‌రావు, రావు ర‌మేష్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌, రాజా ర‌వీంద్ర‌, అశోక్ కుమార్‌, ప్ర‌భావ‌తి, జ‌బ‌ర్ద‌స్త్ రాము, జ‌బ‌ర్ద‌స్త్ బాబి, గౌత‌మ్‌రాజు, అప్పాజి, క్రాంతి కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు సంగీతం: కె.ఎమ్‌.రాధాకృష్ణ‌న్‌, పాట‌లు: వ‌న‌మాలి, పెద్దాడ‌మూర్తి, శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, కెమెరా: జి.ఎల్‌.ఎన్‌.బాబు, ఎడిటింగ్: మ‌ధు, నృత్యాలు: భాను, క‌థ‌: శ్రీమంగ‌ళం, ర‌మ్య‌, ఆర్ట్: కృష్ణ‌మాయ‌, నిర్మాణ స‌హ‌కారం: యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, నిర్మాత‌లు: శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, ర‌మ్య గోగుల‌, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బాలాజి సాన‌ల‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here