ప్రతీ సంవత్సరం సంక్రాంతి పండుగ వస్తుందంటే ప్రేక్షకులు మంచి మాస్ ఎంటర్ టైనర్ కోసం ఎదురుచూస్తారు. అలా ఈ సంవత్సరం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుక గా వస్తున్న కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ “వినయ విధేయ రామ”. ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి గారు నిర్మాత. ఈ చిత్రం జనవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో ఇంటర్వ్యూ.

వినయ విధేయ రామ టైటిల్‌ వినగానే ఫస్ట్‌ మీ రియాక్షన్‌?
– నాకు బోయపాటి గారి ‘జయ జానకి నాయక’ టైటిల్‌ అంటే చాలా ఇష్టం. అందుకే దానికి దగ్గరగా ఉండి.. కథలో భాగం అయ్యి ఈ సంక్రాంతి పండుగకు కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించింది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ బాగాఎలివేట్‌ అయ్యే అంశాలు?
– ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ప్రతీ ఇంట్లో ఒక మంచి కొడుకు కానీ.. మంచి మరిది కానీ ఉంటే ఎలా ఉంటుందో అలా బ్యూటిఫుల్‌గా డిజైన్‌ చేసిన క్యారెక్టర్‌. పురాణాలలో చూసుకుంటే రాముడు అయోధ్యలో వినయంగా, యుద్ధం చేసేటప్పుడు ఎంత విధ్వంసంగా ఉంటాడో అలా ఉంటుంది. ప్రతీ మనిషిలో ఉండే ఈ రెండు కోణాలను సినిమాలో బోయపాటి గారు అద్భుతంగా ప్రజంట్‌ చేశారు.

ధ్రువ, రంగస్థలం లాంటి డిఫరెన్ట్‌ స్టోరిస్‌ తర్వాత యాక్షన్‌ మూవీ చేయడం ఎలా అనిపించింది?
– ఒక ఆర్టిస్ట్‌గా ఒకే జోనర్‌కి పరిమితం కాకుండా అన్ని జోనర్స్‌లో చేయాలనేది నా కోరిక. 80వ దశకంలో నాన్న గారు అతి తక్కువ టైంలో అన్ని జోనర్స్‌లో నటించిన సందర్భాలు ఉన్నాయి.నా విషయానికి వస్తే జోనర్‌ కంటే సెన్సిబుల్‌ సినిమాలను కన్విక్షన్‌ ఉన్న డైరెక్టర్స్‌తో చేయాలనుకుంటున్నాను.

దర్శకుడు బోయపాటి శ్రీను గురించి?
– బోయపాటి గారు ప్రస్తుతం ఉన్న వారిలో వన్‌ ఆఫ్‌ ది సక్సస్‌ఫుల్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌. సినిమాపై ఆయనకు ఉన్న క్లారిటీ కానీ కన్వెక్షన్‌ కానీ నిజంగా చాలా గొప్పవి. ఆయన అన్ని సినిమాలో మంచి లవ్‌ స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో వయిలెన్స్‌ ఎక్కువగా ఉండదు. కథకు, సందర్భానికి తగ్గట్టుగానే ఆయన డిజైన్‌ చేశారు. సినిమాలో అన్నీ అంశాలున్నాయి కాబట్టే సినిమాకు యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చారు.ఈ సినిమాలో వచ్చే రాంబో సీన్‌ కూడా బోయపాటి గారు నాకు రెండు సంవత్సరాల క్రితమే నాకు చెప్పారు. ఆ సన్నివేశాల విషయంలో బోయపాటి గారు అస్సలు కాంప్రమైజ్‌ కాలేదు. సినిమాకు ఆ ఎపిసోడ్‌ వన్‌ అఫ్‌ ది హైలెట్‌ అవుతుంది. ‘వినయ విధేయ రామ’ పక్కా బోయపాటి మార్క్ ఫిలిమ్. అందరు హీరోలూ బోయపాటి గారితో ఒక సినిమా చేయాలి

మీ నాన్న గారి గ్యాంగ్‌ లీడర్‌ సినిమాకు దగ్గరగా ఉంటుంది అంటున్నారు?
– అలా ఎందుకు అంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఇది టోటల్‌గా డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. ప్రతి సినిమాలో ఫ్యామిలీ అనేది ఉంటుంది. అంతమాత్రాన వేరే సినిమాతో ఎలా పోల్చుతారు. నేను ఎప్పటినుంచో ‘గ్యాంగ్‌ లీడర్‌’ లాంటి సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ.. ఇది ఆ సినిమా అని నేను అనుకోవడంలేదు.

ఈ సినిమాలో ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా?
– ఈ సినిమాలో పెద్ద పెద్ద డైలాగ్స్‌ చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా బోయపాటి గారి సహకారంతో ఆ డైలాగ్స్ ని ఆయన వెర్షన్ లొనే చెప్పడం జరిగింది.అజర్‌ బైజాన్‌లో యాక్షన్‌ పార్ట్‌ను వేసవిలోనే చేద్దామని అనుకున్నాం కానీ ఆ షెడ్యూల్‌ జనవరిలో చేయాల్సి వచ్చింది. అంత తక్కువ టెంపరేచర్‌లో షూట్‌ చేయడం చాలా కష్టమైనా, ఆ జోష్‌ తో చేసేశాం.

ధ్రువ సినిమా తరువాత మీ వ్యక్తిత్వంలో చాలా చేంజెస్‌ వచ్చాయి?
– కొన్ని సినిమాల కలెక్షన్స్‌ విషయంలో విభేదాలు వచ్చాయి. అది అవసరమా..అనిపించింది. మేము అందరం హ్యాపీగా మంచి సినిమాలు చేశాం. మా అందరి ప్రొడ్యూసర్స్‌ హ్యాపీ…ఈ చిన్న అంశంతో మా మధ్య మనస్పర్థలు రావడం ఇష్టం లేక మా ఫ్యాన్స్‌ తరపున కలెక్షన్స్‌ పెట్టొద్దు అని రిక్వెస్ట్‌ చేయడం జరిగింది. ఇక బాండింగ్‌ విషయంలో మేము ఎప్పుడూ అలానే ఉండే వాళ్ళం ఈ మధ్య సోషల్‌ మీడియా వచ్చింది కాబట్టి అందరికి తెలుస్తుంది. కాని తారక్‌ నేను రెగ్యులర్‌గా కలిసే వాళ్ళం. మహేష్‌ బాబుతో ఈ మధ్య ఎక్కువగా ఇంటరాక్ట్‌ అవుతున్నాను. అందరిని కలుపుకు పోవడం అనేది నాన్నగారే చైన్నైలో స్టార్ట్‌ చేశారు. అదే నేను ఫాలో అవుతున్నాను.

సాధారణంగా నేను హీరోగా నటించే సినిమాలకు సంబంధించి విదేశాలకు వెళ్లినప్పుడు నా పర్సనల్‌ టీంకు ప్యాకెట్‌మనీ ఇస్తుంటాను. ఇక నిర్మాతగా కాబట్టి యూనిట్‌ అందరికీ ఇవ్వాలి. ఖైదీ నంబర్‌ 150″ సినిమాకు కూడా యూనిట్‌కి ప్యాకెట్‌ మనీ ఇచ్చాను. అలాగే సైరా సినిమా షూటింగ్‌ను విదేశాల్లో చేస్తున్నప్పుడు ప్యాకెట్‌ మనీ ఇచ్చాను. ఎందుకంటే అది నా ప్రొడక్షన్‌. నేను యూనిట్‌ను బాగా చూసుకుంటే అవుట్‌ పుట్‌ బాగా వస్తుందనే నమ్మకం.

ఈ సినిమాలో హ్యుజ్‌ స్టార్‌ కాస్ట్‌ గురించి చెప్పండి?
– స్నేహ గారితో నాకు మంచి వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉంది. అలాగే ఆర్యన్‌ రాజేష్‌ గారు చాలా కాలం తరువాత తెరపైన కనపడడం హ్యాపీ. ప్రశాంత్‌ గారు అందరికి నచ్చిన మంచి ఆర్టిస్ట్‌. ‘రక్త చరిత్ర’ సినిమా చూసి వివేక్‌ ఒబెరాయ్‌ గారిని ఈ రోల్‌ కోసం తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఫైన్‌ ఆర్టిస్టులతో కలిసి నటించడం నిజంగా నా అదృష్టం.

సైరా షూటింగ్‌ షెడ్యూల్‌ విషయంలో ప్రొడ్యూసర్‌గా మీరు హ్యాపీనా?
– ‘సైరా’ చాలా పెద్ద ప్రాజెక్ట్. దీనికోసం ప్రొడక్షన్‌ టీం, డైరెక్టర్స్‌ టీం చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఇంకో రెండు నెలలలో షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఈఇయర్‌ సెకండ్‌ హాఫ్‌లో సినిమా విడుదలకు ప్లానింగ్‌ జరుగుతుంది. ‘సైరా’ కోసం నాన్న గారికి నిర్మాతగా నేను ఇచ్చిన రెమ్యూనరేషన్‌ తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకూ ఎవ్వరూ ఇచ్చిఉండరు.

సైరా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది గురించి?
– పాటలు షూటింగ్‌ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఒక ట్యూన్‌ వచ్చిన తరువాత ఇమ్మిడియట్‌గా ఎలాంటి మార్పులు లేకుండా ఓకే చేసిన ట్యూన్‌ అమిత్‌ త్రివేది నెక్స్ట్ ప్రభాస్‌ చేసే సినిమాకు కూడా అమిత్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అని విన్నాను. వెరీ సెన్సిబుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

రంగస్థలం సినిమాకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డ్‌ వచ్చింది కదా ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?
– వెరీ వెరీ హ్యాపీ… చేసిన పనికి మంచి అప్రీసియేషన్‌ ఉన్నప్పుడు నాకు, ఎంటైర్‌ టీంకు కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ‘రంగస్థలం’ సినిమా నేను, సుకుమార్‌గారు కలిసి భోజనం చేస్తూ ఓకే చేసిన కథ. ఆ సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్‌ చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాను.

ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి గురించి?
– నేను ఇంతకు ముందు చెప్పినట్టు దానయ్య గారు భారీ సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యారు. ఆయనతో కలిసి సినిమా చేయ్యడం చాలా హ్యాపీ. చాలా గట్స్‌ ఉన్న ప్రొడ్యూసర్‌, మరిన్ని గట్స్‌ ఉన్న బ్యానర్ కనుకనే ఈ బ్యానర్ లో వెంటనే ఆర్.ఆర్.ఆర్ మొదలయ్యింది. తరువాత నాన్న గారు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కూడా ఈ బ్యానర్ లొనే ఉంటుంది.

ఆర్‌.ఆర్‌.ఆర్‌ గురించి?
-ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాలో కామన్‌మాన్‌కి చాలా దగ్గరగా ఉండే డీ-గ్లామర్‌ క్యారెక్టర్‌. తప్పకుండా కామన్‌ మ్యాన్‌కు కనెక్ట్‌ అవుతుంది. తారక్‌కు నాకు మంచి స్నేహం ఉండడంతో సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ హ్యాపీగా పూర్తయింది. సెకండ్‌ షెడ్యూల్‌ సంక్రాంతి పండుగ తరువాత ప్లాన్‌ చేస్తున్నారు రాజమౌళి గారు. ఇలాంటి ఓ మంచి ఆఫర్‌ వచ్చినందుకు నేను, తారక్‌ షాకయ్యాం. నాకు, తారక్‌ కంటే ఆయనకే ఎక్కువ పని. మా ఇద్దరి ఫ్యాన్స్‌, రాజమౌళిగారి సినిమాలకున్న ఫ్యాన్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ సినిమా చేస్తారని అనుకుంటున్నాను. కథను బట్టే రాజమౌళిగారు నన్ను, తారక్‌ను ఈ సినిమా కోసం కలిసి కథ చెప్పారు.ఆర్.ఆర్‌.ఆర్‌ సినిమాకు ఒక నటుడిగానా 150% ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌ ఎంటర్‌టైనర్‌గా రాజమౌళి గారు ఆర్‌.ఆర్‌.ఆర్‌ను తెరకెక్కిస్తున్నారు.

చిరంజీవి గారి తదుపరి చిత్రాల గురించి?
కొరటాల శివగారి సినిమా తర్వాత త్రివిక్రమ్‌గారి సినిమా ఉంటుంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత నేను, కొరటాలగారితో చేయాల్సింది. అయితే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ వల్ల కొరటాలగారు నాన్నగారితో సినిమా చేస్తున్నారు.

Ram Charan – Pics (Vinaya Vidheya Rama Interview)