సుమంత్‌, ఈషా రెబ్బా హీరో హీరోయిన్స్‌గా సుధాకర్‌ ఇంపెక్స్‌ ఇండియా ప్రై.లి. పతాకంపై సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్రం డిసెంబర్‌ 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సుమంత్‌తో ‘ఇండస్ట్రీ హిట్‌’ ఇంటర్వ్యూ.

‘మళ్ళీరావా’ లాంటి మంచి ప్రేమ కథ తరువాత థ్రిల్లర్‌ కథలు కమర్షియల్‌గా వర్కవుట్‌ అవుతాయా?
– ‘మళ్ళీరావా’ కథ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. అది కమర్షియల్‌గా వర్కవుట్‌ అవుతుందా? లేదా? అని ఆలోచించలేదు. నేను చాలా వరకు నా సినిమాలు కమర్షియల్‌గా వర్కవుట్‌ అవుతాయా? అని ఆలోచించను. ‘మళ్ళీరావా’ సక్సెస్‌ తర్వాత నాకు ప్రేమ కథలు వస్తాయని అనుకుంటే థ్రిల్లర్‌ కథలు వచ్చాయి. ఒకే తరహా కథలు చేయడం నాకు నచ్చలేదు. మారుస్తూ ఉంటాను. నాకు థ్రిల్లర్‌ సినిమాలు నచ్చవు. సినిమా కథ వినే మధ్యలోనే మిడిల్‌ డ్రాప్‌ అయిపోదామనే అనుకుని కూర్చున్నాను. అయితే దర్శకుడు సంతోష్‌ నన్ను రెండున్నర గంటల పాటు కూర్చొని పెట్టాడు. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా చేసుకుని వెళ్లిపోయాం. కొన్ని కథల్లో నేను కూడా డైరెక్టర్‌తో ట్రావెల్‌ చేసేటప్పుడు చిన్న చిన్న మార్పులు చెబుతుంటాను.

సంతోష్‌ కథ చెప్పినప్పుడు మీకేమనిపించింది?
– సంతోష్‌ నాకు కథ చెప్పినప్పుడు.. కథంతా బాగానే చెప్పాడు. అయితే టెక్నికల్‌గా తనెంత బాగా చేస్తాడనే చిన్న సందేహమైతే మనసులో ఉండింది. తను చాలా షార్ట్‌ ఫిలింస్‌ చేశాడు. కొన్నింటికి అవార్డులు కూడా వచ్చాయి. అన్నీ షార్ట్‌ ఫిలింస్‌ థ్రిల్లర్‌ జోనర్‌లోనివే. అవి చూసిన తర్వాత నాకు కాన్ఫిడెంట్‌ వచ్చింది. నిర్మాత సుధాకర్‌రెడ్డిగారు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్డ్‌గా చేద్దామనుకునే తత్వం కాదు.

ఈ చిత్రంలో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
– ‘మళ్ళీరావా’లో నా క్యారెక్టర్‌ పేరు కార్తీక్‌. ఈ చిత్రంలో కూడా నా పేరు కార్తీక్‌. హేతువాది, నాస్తికుడు. అయితే నేను నిజానికి ఆస్తికుడిని. గుళ్లకు, చర్చిలకు, మసీదులకు వెళ్తుంటాను. ప్రార్థనలు చేయను కానీ. దణ్ణం పెట్టుకుంటూ ఉంటాను. పురాతన ఆలయాలపై రీసెర్చ్‌ స్కాలర్‌గా పాత్రలో కనపడతాను.

మీ సినిమాలో ఇంట్రడక్షన్‌ సీన్స్‌ ఉండాలని కోరుకుంటారా?
– నాకు ఇంట్రడక్షన్‌ సాంగ్స్‌, ఫైట్స్‌, స్లో మోషన్‌ బిల్డప్‌ షాట్స్‌ ఉండాలనుకోను. అయితే నా స్నేహితులు మహేశ్‌, తారక్‌లు చేస్తే నాకు ఇష్టం. విజిల్‌ కూడా వేస్తాను.

ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ ఉన్న ప్రాధాన్యత గురించి?
– సినిమాలో కథానుగుణంగా గ్రాఫిక్స్‌ ఉంటాయి. అంతే తప్ప ఏదో భారీ రేంజ్‌లో గ్రాఫిక్స్‌ ఉంటాయని చెప్పను.

ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు?
– ఈ చిత్రానికి స్పష్టమైన తెలుగును వాడాం. తన యాంగిల్‌లో కథను చెప్పడం ఉంటుంది కాబట్టి బాగా తెలుగు మాట్లాడే వ్యక్తి కావాలని అనుకున్నాం. అలా అనుకోగానే రానా గుర్తుకు వచ్చాడు. ఆ సమయంలో తను ‘హౌస్‌ఫుల్‌4’ చిత్రీకరణలో బిజీగా బిజీగా ముంబైలో ఉన్నాడు. డైరెక్టర్‌ సంతోష్‌ వెళ్లి కథ చెప్పగానే తనకు బాగా నచ్చింది. తను షూటింగ్‌ సమయంలో ఉన్న గ్యాప్‌లో డబ్బింగ్‌ చెబుతూ వచ్చాడు.

‘యన్‌.టి.ఆర్‌. బయోపిక్‌’లో మీ తాతగారి పాత్రలో నటిస్తున్నారు కదా! ఎలా అన్పించింది?
– క్రిష్‌ నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరు. చాలా కాలంగా మంచి పరిచయం ఉంది. తను ‘యన్‌.టి.ఆర్‌’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నప్పుడు ఇందులో తాతగారి పాత్ర ఉంటుందని అనుకోలేదు. క్రిష్‌ తాతగారి పాత్ర కోసం నన్ను అప్రోచ్‌ కాగానే నా అద ష్టంగా, ఆశీర్వాదంగా భావించాను. ఫుల్‌ ప్లెజ్‌డ్‌ క్యారెక్టర్‌ చేశాను. రెండు భాగాల్లోనూ కనపడతాను. బాలక ష్ణగారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. తాతగారిలా చేయడం కష్టంగా ఉంటుందా? లేదా? అని ఆలోచించలేదు. ఓ బాధ్యతగా తీసుకుని నటించాను. అలాగని ఎక్కువ ఒత్తిడిని ఫీల్‌ కాలేదు. ఆయన సినిమాలు, ఇంటర్వ్యూలు చూశాను. ఇమిటేషన్‌కి, యాక్టింగ్‌కి మధ్యలో ఓ చిన్న లైన్‌ ఉంటుంది. అలాంటి లైన్‌లో ఉండే నటనను చేసుకుంటూ వచ్చాను.

బాలకృష్ణగారితో నటిస్తున్నారు కదా! ఆయన సెట్లో ఎలా ఉండేవారు?
– బాలక ష్ణగారు ఓ ఎన్‌సైక్లోపీడియా. ఆయన సినిమాలకు సంబంధించిన డైలాగ్స్‌ను అలా చెప్పేసేవారు. తాతగారు సెట్స్‌లో ఎలా ఉండేవారో.. ఎలా చేసేవారో కూడా చెప్పేవారు. ఆయనతో కలిసి చేయడం నా అద ష్టం.

మీ తాతగారితో మీకున్న అనుబంధం గురించి?
– మా కుటుంబ సభ్యులందరూ నేను తాతగారిలా ఉంటానని అనుకుంటూ ఉంటారు. నేను మా అమ్మలా ఉంటాను.. మా అమ్మ అచ్చం తాతగారిలా ఉంటారని అంటుంటారు. ఆయనతో పెరగడం.. ఆయన నన్ను దత్తత తీసుకుని పెంచారు. ఆయన పోలికలు రావడం నా అద ష్టం. నేను మేకప్‌ వేసుకుం టున్నప్పుడు అద్దంలో చూసి తాతగారిని చూస్తున్నాననే ఫీల్‌ అయ్యేవాడిని. మహానటిలో చైతన్య తాతగారిలా చేశాడు. అది కూడా ఎంజాయ్‌ చేశాను. రెండు బయోపిక్స్‌లో ఒక దానిలో, చైతు తాతగారిలా చేయడం అద ష్టమే.

మీ తదుపరి చిత్రాలు?
– ‘ఇదంజగత్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. మంచి రిలీజ్‌ డేట్‌ చూసి విడుదల చేయాలనుకుంటున్నాం. తదుపరి కొత్త దర్శకుడితోనే సినిమా చేయబోతున్నాను. పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా. అన్నా చెల్లెల అనుబంధం ఆధారంగా ఆ సినిమా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేయనటువంటి కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది.

Sumanth ‘Subrahmanyapuram’ Interview Pics