బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా వంశధార క్రియేషన్స్‌ బ్యానర్‌పై నవీన్‌ సొంటినేని (నాని) నిర్మిస్తున్న చిత్రం ‘కవచం’. నూతన దర్శకుడు శ్రీనివాస్‌ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 7న విడుదల అవుతుంది. ఈ సందర్బంగా హీరోయిన్‌ ‘కాజల్‌’ తో ఇండస్ట్రీహిట్‌ ఇంటర్వూ..

‘కవచం’ సినిమా ఒప్పుకోవడానికి ఏదయినా స్పెషల్‌ రీజన్‌ ఉందా?
– నాకు మొదటినుండి క్రొత్త, టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌తో పనిచేయడం, కొత్త జోనర్‌ లలో ఎక్స్‌పరిమెంట్స్‌ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ సినిమా విషయానికి వస్తే మంచి లవ్‌ స్టోరీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కూడుకున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఈ సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడు మంచి థ్రిల్‌తో ఎంజాయ్‌ చేస్తూ చూసేలా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే సన్నివేశాలు ప్రతీఒక్కరిని ఆశ్యర్యానికి గురి చేస్తూ థియేటర్‌లో ఆడియన్స్‌ను కట్టిపడేసేలా కథ టర్న్‌ తీసుకుంటుంది. నాకు కవచం మంచి ఎక్స్పెరిమెంటల్‌ మూవీగా అనిపించి ఒప్పుకోవడం జరిగింది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ ఇంపార్టెన్స్‌?
– డైరెక్టర్‌ శ్రీనివాస్‌ గారు కథ నరేషన్‌ టైం లోనే సినిమాలో రెండు ఇంపార్టెన్స్‌ క్యారెక్టర్స్‌ గురించి చెప్పడం జరిగింది అందులో నాది క్యారెక్టర్‌ ఒకటి. ఈ సినిమాలో హీరోతో పాటు సమాన ప్రాముఖ్యత గల పాత్ర.

చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటికీ యంగ్‌ హీరోయిన్లకు కంపిటేషన్‌గా ఉండడం ఎలా అనిపిస్తుంది?
– ఇండస్ట్రీలో మనం ఎంత కాలం ఉన్నది ముఖ్యం కాదు. మనం సినిమా పట్ల ఎంత గౌరవంగా,ప్యాషనేట్‌గా ఉన్నాం అన్నది ముఖ్యం. దానికి తోడు మీఅందరి సపోర్ట్‌ కీలకం. నాకు ఆడియన్స్‌ నుంచి మంచి సపోర్ట్‌ లభించింది. మీ సపోర్ట్‌,నా హార్డ్‌ వర్క్‌ కారణంగా ఇంకా మంచి సినిమాలలో నటిస్తాను అనుకొంటున్నాను.

ఈ మధ్య కాలంలో కొంత అనారోగ్యానికి గురయ్యారని విన్నాం?
– అవునండి! కొంతకాలం క్రితం ‘ఆటో ఇమ్యూన్‌ డిసార్డర్‌’తో చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది. మా కుటుంబ సభ్యులు,స్ట్రాంగ్‌ మెడికేషన్‌ కారణంగా ఇప్పుడు పూర్తిగా కోలుకొని మళ్లీ సినిమాలు చేయడం సంతోషంగా ఉంది.

క్వీన్‌ రీమేక్‌ గురించి చెప్పండి ?
– నేను క్వీన్‌ సినిమా రిలీజ్‌ అయ్యి అయిదు సంవత్సరాలు అయినా ఆ సినిమా ఇంకా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో కంగనా అమాయకంగా ఉండే అందమైన అమ్మాయి పాత్ర ఇప్పటికీ నాకు గుర్తుకువస్తుంది అందుకే రిమేక్‌ లో ‘పరమేశ్వరి’ క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ఇది పూర్తిగా తమిళ్‌ నేటివిటీలో సాగే సినిమా. ఎక్కువగా తమిళ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. ఈచిత్రం షూటింగ్‌ పూర్తయింది సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలవుతుంది.

బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ గురించి ?
– సాయి చాల మంచి వ్యక్తి. స్వీట్‌ పర్సనాలిటీ .ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు తన తండ్రి పేరును ఉపయోగించుకొని ఎదిగాలనే ఉద్దేశంతో కాకుండా స్వతహాగా పైకి రావాలనే తపన వున్నవ్యక్తి. తనకు ఈగో అస్సలు ఉండదు.తనతో కలిసి వర్క్‌ చేయడం చాలా హ్యాపీ.

తేజ దర్శకత్వంలో మళ్ళీ నటిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ?
– ఆ చిత్రం కోసం చాలా ఆసక్తిగా పనిచేస్తున్నాను. నా కెరీర్‌ లోనే ఒక అద్భుతమైన రోల్‌ తేజ గారు నాకు ఆ సినిమా ద్వారా ఇచ్చారు. నాకు ఛాలెంజిన్గ్‌ తో కూడుకున్న పాత్ర అది. ఖచ్చితంగా ఆ చిత్రం నా కెరీర్‌ లో గుర్తిండిపోయే సినిమా అవుతుంది.

ఇటీవల దీపికా మరియు ప్రియాంక పెళ్లిళ్లు చేసుకున్నారు కదా !మీ పెళ్లి గురించి ?
నవ్వుతూ. . నాకు కూడా పెళ్లి చేసుకోవాలనే వుంది కానీ ప్రస్తుతం నా కెరీర్‌ పిక్స్‌ స్టేజి లో వుంది. ఇలాంటి సమయం లో దాని గురించి ఆలోచించడం లేదు.

భారతీయుడు-2 గురించి ?
శంకర్‌ – కమల్‌ హాసన్‌ చిత్రంలో నటించే అవకాశం రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ప్రస్తుతానికైతే ఈ చిత్రం గురించి ఏమి చెప్పలేను. త్వరలోనే సినిమా వివరాలు వెల్లడిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్‌ కాజల్‌.