ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేను లేను”. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరోగా న‌టిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ టీజర్ ను విడుదలచేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ … అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన చిత్రం నేను లేను .చిత్రీకరణ పూర్తయింది. డిటిఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది‌. ఈ నెలలొనె పాటలను విడుదల చెస్తాము. కథనం, సంగీతం, కెమెరావర్క్ మా సినిమాకు ఎసెట్ గా నిలుస్తాయన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలుఃజోజో, నిర్వాహ‌ణ:సురేష్‌కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌:సాయిస‌తీష్‌ పాల‌కుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ:రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌. సహ నిర్మాత : యాషిక , నిర్మాత : సుక్రి కుమార్ రచన , దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్ .ఎస్ .కె