బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతున్న‌ చిత్రం క‌వ‌చం. ఈ చిత్ర టీజ‌ర్ న‌వంబ‌ర్ 12న విడుద‌ల కానుంది. దివాళికి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు బెల్లంకొండ శ్రీ‌నివాస్. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ ఈ థ్రిల్ల‌ర్ ను తెర‌కెక్కిస్తున్నారు. మెహ్రీన్ కౌర్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్త‌యింది.. కేవ‌లం పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ సొంటినేని(నాని) క‌వచం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.