క్రైమ్ థ్రిల్లర్ గా యువ దర్శకుడు నాగు గవర తెరకెక్కించిన” కర్త కర్మ క్రియ”. ఈ వారం విన్నర్ గా నిలిచింది. లిమిటెడ్ బడ్జెట్ లొ కంటెంటె ప్రధాన బలంగా నాగు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా” కర్త కర్మ క్రియ ” ఈ రోజు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. కొత్త నటీనటులను లీడ్ రొల్స్ లొ పరిచయం చేయటంతో పాటు, వైవిధ్యమైన చిత్రాలను అందించె చదలవాడ బ్రదర్స్ బ్యానర్ పై మరో హిట్ మూవీని దర్శకుడు నాగు అందించాడు. తన తొలి సినిమా వీకెండ్ లవ్ ను మెచ్యూర్డ్ లవ్ స్టోరీ గా , రెండో సినిమాను క్రైమ్ థ్రిల్లర్ గా తీసి తాను అన్ని తరహా కథలను తీయగలనని నిరూపించుకున్నాడు. ఇక ఈ వారం భారీ చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై సక్సెస్ ను అందుకున్న “కర్త కర్మ క్రియ ” ఏ సినిమాకైనా కంటెంటె ఇంపార్టెంట్ అని మరోసారి నిరూపించింది.